News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Weather Latest Update: తెలంగాణలో ఈవారం ఠారెత్తనున్న ఎండ, ఐఎండీ హెచ్చరిక - ఏపీలో ఈ జిల్లాల్లో వడగాడ్పులు!

రాగల 7 రోజులు తెలంగాణ రాష్ట్రం అంతటా గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు స్థిరంగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

FOLLOW US: 
Share:

ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు దక్షిణ చత్తీస్ గఢ్ మరియు పరిసరాల్లోని తెలంగాణ మీద ఒక ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఏర్పడింది. దీని వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల 7 రోజులు తెలంగాణ రాష్ట్రం అంతటా గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు స్థిరంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా చుట్టు పక్కల 2, 3 జిల్లాలలో రేపు ఎల్లుండి 39 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారులు అంచనా వేశారు. 

హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 41 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 40.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 30.0 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 41 శాతంగా నమోదైంది.

ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది.

రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లాలోని చింతూరు, కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు తీవ్రవడగాల్పులు, 135 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి(సోమవారం) 8 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 268 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వెల్లడించారు. శనివారం పల్నాడు జిల్లా రావిపాడు 45.6 C, గుంటూరు జిల్లా మంగళగిరి, తూర్పుగోదావరి జిల్లా పేరవలి, బాపట్ల జిల్లా వేమూరు, మన్యం జిల్లా పేదమేరంగిలో 45.5 C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు.

• శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39 C - 41 C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 C - 45 C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• కోనసీమ, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 C - 43 Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Published at : 04 Jun 2023 06:46 AM (IST) Tags: Weather Updates Weather in Andhrapradesh Weather in Hyderabad weather in ap telangana Temperatures in Telangana Summer in hyderabad

ఇవి కూడా చూడండి

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Telangana Elections: తెలంగాణ బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల, ఆర్ఎస్పీ పోటీ ఎక్కడినుంచంటే?

Telangana Elections: తెలంగాణ బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల, ఆర్ఎస్పీ పోటీ ఎక్కడినుంచంటే?

Modi On KCR : ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారా ? నిజామాబాద్ సభలో కీలక విషయాలు వెల్లడించిన మోదీ !

Modi On KCR : ఎన్డీఏలో  చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారా ?  నిజామాబాద్ సభలో కీలక విషయాలు వెల్లడించిన  మోదీ !

Mancherial New: చెన్నూరులో గోదావరి తీరాన తాంత్రిక పూజల కలకలం, వ్యక్తి మృతి

Mancherial New: చెన్నూరులో గోదావరి తీరాన తాంత్రిక పూజల కలకలం, వ్యక్తి మృతి

Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు- పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం

Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు- పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం

టాప్ స్టోరీస్

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన  రౌస్ అవెన్యూ కోర్ట్ !