Weather Latest Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
నిన్నటి ఉత్తర అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం ఈరోజు ఉత్తర కోస్తా కర్నాటక, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రం మట్టానికికి 4.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతుంది. నిన్న తమిళనాడు కోస్తా వద్ద నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఈ రోజు అదే ప్రాంతంలో సగటు సముద్రం మట్టంకి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతుంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 90 శాతంగా నమోదైంది.
ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
సెప్టెంబరు 29 నాటికి ఉత్తర అండమాన్ సముద్రం & పరిసరాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తదుపరి 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తరువాత, ఇది క్రమంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణవిభాగం వెల్లడించింది.