Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పొడి వాతావరణమే! ఉత్తరాదిలో కాస్త వర్షాలకు ఛాన్స్
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ/వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రము వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (ఆగస్టు 28) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ, వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.1 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 75 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉత్తరాదిలో చురుగ్గా వర్షాలు
ఢిల్లీ వాతావరణంలో మరోసారి మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా సమాచారం ఇచ్చింది. ఇది కాకుండా, సెప్టెంబర్ 3 వరకు ఢిల్లీ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, సోమవారం ఢిల్లీలో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. తాజా వాతావరణం ప్రకారం కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
వాతావరణ శాఖ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం సాధారణంగా మేఘావృతమై తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. IMD వివరాల ప్రకారం, ఆగస్టు 29న ఢిల్లీలో మేఘావృతమై ఉంటుంది. మంగళవారం కూడా బలమైన గాలి వీచే అవకాశం ఉంది. దీని తరువాత, ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3 వరకు ఢిల్లీ మేఘావృతమై ఉంటుంది. ఈ సమయంలో, కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 28 డిగ్రీల పరిధిలో ఉంటుంది. దీనికి విరుద్ధంగా, గరిష్ట ఉష్ణోగ్రత 36 నుండి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు.
వర్షాలు లేనప్పుడు కాలుష్యం పెరుగుతుందన్న సంకేతాలు
వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే కొద్ది రోజులు ఢిల్లీ ఎన్‌సీఆర్ చుట్టూ వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు లేకపోతే, సెప్టెంబర్‌లో ప్రజలు మరోసారి వేడిని అనుభవించవచ్చు. మరోవైపు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే, వాయు కాలుష్యం స్థాయి పెరగవచ్చు.