Weather Latest Update: అంతా విస్తరించిన రుతుపవనాలు - నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
రాగల 3 రోజులకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఈ రోజు చాలా చోట్ల, రేపు, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈ రోజు నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోని మరి కొన్ని భాగాలకు (నిజామాబాద్ వరకు) విస్తరించాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం (జూన్ 23) ఓ ప్రకటనలో తెలిపారు. రాగల 1-2 రోజుల్లో తెలంగాణలో అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. ఈ రోజు ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం, పరిసరాలలోని ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా కొనసాగుతుందని వివరించారు.
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాగల 3 రోజులకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఈ రోజు చాలా చోట్ల, రేపు, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాలు, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 68 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
నైరుతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించినట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. రుతుపవనాలు వేగంగా విస్తరించడానికి సాయపడినట్లుగా అధికారులు అంచనా వేశారు. అటు ఉపరితల ఆవర్తనం, ఇటు రుతుపవనాల ప్రభావంతో నేడు, రేపు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. పశ్చిమగోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అల్లూరి, తూర్పుగోదావరి, మన్యం, అనకాపల్లి, బాపట్ల జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
విజయనగరం, చిత్తూరు, శ్రీకాకుళం, కాకినాడ, ప్రకాశం, అన్నమయ్య, కడప, విశాఖపట్నం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial