(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు! ఉత్తరాదిన దంచికొడుతున్న వానలు - ఐఎండీ
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
ఈ రోజు ఉత్తర - దక్షిణ ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా కొమరిన్ ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిమీ ఎత్తు వద్ద ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (ఆగస్టు 23) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య /పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈరోజు భారీ వర్షాలు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.2 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 84 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న అల్పపీడన ద్రోణి కోస్తా భాగాలపై కొనసాగుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని వలన దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉత్తరాదిలో పిడుగులు
భారత వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం, దేశ రాజధానిలో మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అంతే కాకుండా గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆగస్టు 24 గురువారం నుండి వాతావరణంలో మార్పు ఉండవచ్చు, ఆ తర్వాత ఉష్ణోగ్రత పెరుగుతుంది. మరోవైపు బుధవారం (ఆగస్టు 23) గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. వాతావరణ శాఖ అధికారుల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని చాలా జిల్లాలు తేమ వేడి నుండి ఉపశమనం పొందబోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు.
రెడ్ అలర్ట్ జారీ
ఆగస్టు 22 మంగళవారం రాత్రి హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆగస్టు 23, బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఎనిమిది జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసింది. దీంతో స్థానిక వాతావరణ కార్యాలయం 'రెడ్ అలర్ట్' ప్రకటించింది. అదే సమయంలో, ఆగస్టు 25, 26 తేదీలలో రాష్ట్రంలో పసుపు అలర్ట్ జారీ చేసింది. ఇది కాకుండా తెలంగాణ, మరాఠ్వాడా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, ఇంటీరియర్ కర్ణాటక, కేరళలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.