Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలు, ఉత్తర తెలంగాణలో మాత్రం ఎల్లో అలర్ట్
ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది.
![Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలు, ఉత్తర తెలంగాణలో మాత్రం ఎల్లో అలర్ట్ Weather in Telangana Andhrapradesh Hyderabad on 16 January 2023 Winter updates here Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలు, ఉత్తర తెలంగాణలో మాత్రం ఎల్లో అలర్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/16/4cef54f6d2ca4fd649d6761b11be55c31673831756611234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏపీ, యానాం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి దిగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. క్రిష్ణా, గుంటూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.
ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. సోమవారం (జనవరి 16) నుంచి మూడు రోజుల పాటు మరో కోల్డ్ స్పెల్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. వరుసగా కొన్ని రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దీనిని ఓల్డ్ స్పెల్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 5 నుంచి 9 తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్ స్పెల్‌లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి.
రానున్న 5 రోజుల్లో ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. జనవరి 18 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. పశ్చిమ తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.
హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 31.8 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం 071 శాతంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) January 15, 2023
— IMD_Metcentrehyd (@metcentrehyd) January 15, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)