News
News
X

Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు భారీవర్ష సూచన - పిడుగులు, వడగళ్లు కూడా, ఎప్పటినుంచంటే

ఈ కాలంలో మొదటి భారీ వర్షాలు, మార్చి 16 న నుంచి మొదలైయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మార్చి 16 న మొదలై మార్చి 17, 18, 19 భారీగా మారి మార్చి 21 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

మార్చి నెల సగంలోనే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం (మార్చి 11) పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని ప్రజలు వేడి నుండి కొంత ఉపశమనం పొందవచ్చని అంచనా వేసింది.

వాతావరణ శాఖ ప్రకారం, మార్చి 13 నుండి 18 వరకు మధ్య మరియు దక్షిణ భారతదేశంలో ఉరుములు మరియు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. దీంతో ఆయా రాష్ట్రాల్లో 'హీట్ వేవ్' ప్రభావం తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర భారతదేశంలో వర్ష సూచన లేదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లలో సాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ స్థితి

పశ్చిమ ప్రాంతంలోని ద్రోణి ఇప్పుడు బిహార్ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. అంతేకాక, ఏపీ, యానం మీదుగా దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలంలో మొదటి భారీ వర్షాలు, మార్చి 16 న నుంచి మొదలైయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మార్చి 16 న మొదలై మార్చి 17, 18, 19 భారీగా మారి మార్చి 21 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

‘‘మరో నాలుగు రోజుల్లో కర్ణాటక మీదుగా ఏర్పడుతున్న గాలుల సంగమం బలపడనుంది. దీని వలన తెలంగాణ తో పాటు ఆంధ్రా వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ఒక వైపున ఏమో తేమ గాలులు ఈ గాలుల సంగమం మీదుగా రాగా, మరో వైపున ఇప్పటి దాకా కొనసాగుతున్న పొడిగాలులు గాలుల సంగమంలో ఉంటుంది. ఈ రెండు కలయిక వలన వర్షాలు బాగా పిడుగులతో, బలమైన ఈదురుగాలులతో పడనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్

తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మామూలుగా 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. 36 నుంచి 40 మధ్య అయితే, ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.

హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.5 డిగ్రీలుగా నమోదైంది.

Published at : 12 Mar 2023 06:49 AM (IST) Tags: Weather Updates Weather in Andhrapradesh Weather in Hyderabad rain in hyderabad weather in ap telangana Rains In Telangana

సంబంధిత కథనాలు

TS SSC Exams: తెలంగాణలో రేపట్నుంచి 'టెన్త్ క్లాస్' ఎగ్జామ్స్, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!

TS SSC Exams: తెలంగాణలో రేపట్నుంచి 'టెన్త్ క్లాస్' ఎగ్జామ్స్, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!

SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!

SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

మరో రెండు నెలల పాటు BRS ఆత్మీయ సమ్మేళనాలు- మంత్రి కేటీఆర్

మరో రెండు నెలల పాటు BRS ఆత్మీయ సమ్మేళనాలు- మంత్రి కేటీఆర్

పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగం, సేవ్ టైగర్ ఉద్యమానికి ఎంపీ సంతోష్ కుమార్ మద్దతు

పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగం, సేవ్ టైగర్ ఉద్యమానికి ఎంపీ సంతోష్ కుమార్ మద్దతు

టాప్ స్టోరీస్

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204