Weather Updates: మూడు రోజుల్లో అల్ప పీడనం, ఏపీలో ఈ ప్రాంతాల్లో వానలు - తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
Weather News: తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని అంచనా వేశారు.
Rain in Telangana Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న వేళ వచ్చే మూడు రోజులు వానలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, అమరావతిలోని వాతావరణ కేంద్రాలు విడివిడిగా ప్రకటనలు జారీ చేశాయి. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలో వాతావరణం వచ్చే మూడు రోజులు ఇలా ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి గాలులు వీస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసరాల్లో మే 4వ తేదీ కల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తదుపరి 24 నాటికి అదే ప్రాంతంలో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. మళ్లీ ఇది తర్వాతి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంటుంది.
వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈ రోజు (మే 1), రేపు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం నేడు పొడిగా వాతావరణం ఉండే అవకాశం ఉంది. రేపు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు కూడా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
Synoptic features of Andhra Pradesh in Telugu dated 30.04.2022 pic.twitter.com/1cqSdafXF0
— MC Amaravati (@AmaravatiMc) April 30, 2022
Telangana Weather News తెలంగాణలో వాతావరణం ఇలా
ఇక తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని అంచనా వేశారు. దీనికి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో ఆదిలాబాద్, కొమురం భీం - ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా్ల్లో ఒకటి రెండుప్రదేశాల్లో మాత్రం వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) April 30, 2022