Weather Latest Update: నేడు ఓ మోస్తరు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ - కొనసాగనున్న కూల్ వెదర్: ఐఎండీ
Weather Forecast: ఈ రోజు , రేపు మరియు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
Weather Latest News: నిన్న తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు ఈశాన్య రాజస్థాన్ నుండి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9కి. మీ ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా దక్షిణ దిశ నుండి వీస్తున్నాయని తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):
ఈ రోజు , రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)
ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 - 50 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
ఇక్కడ ఎల్లో అలర్ట్
మే 9న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ.) కూడిన వర్షాలు తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల ఈదురు గాలులు గంటకు 6-10 కిలో మీటర్ల నుంచి 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 40.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.9 డిగ్రీలుగా నమోదైంది. 62 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: నిన్న తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు ఈ రోజు తూర్పు రాజస్థాన్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకూ మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది.
ఉపరితల ఆవర్తనం తమిళనాడు మీద సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.