అన్వేషించండి

Weather Latest Update: నేడూ కొనసాగనున్న భారీ-అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ: ఐఎండీ

Weather Warnings: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కొన్నిచోట్ల, అతి భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.

Weather Latest News: ఆగస్టు 30న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు అదే ప్రాంతంలో స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలపడింది. ఈ అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రాగల 30 ఆరు గంటలలో మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య, దాని సమీపంలోని పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం వుంది. ఋతుపవన ద్రోణీ ఈరోజు సగటు సముద్రమట్టం నుంచి కచ్ ప్రాంతంలోని తీవ్ర వాయుగుండం నుంచి పయనిస్తూ పాకిస్తాన్ ఈశాన్య అరేబియా సముద్రం మాలేగాన్, బ్రహ్మపురి జగదల్పూర్, కళింగపట్నం మీదుగా ఆగ్నేయ దిక్కులో కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని స్పష్టమైన అల్పపీడన ప్రాంతం వరకు విస్తరించింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (Weather Warnings):
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కొన్నిచోట్ల, అతి భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో, రేపు ఎల్లుండి గంటకు 40 నుండి 50 కి. మీ. వేగంతో అక్కడ అక్కడ వీచే అవకాశం వుంది.

నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.7 డిగ్రీలుగా నమోదైంది. 78 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: పశ్చిమ మధ్య, ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్ప పీడనం పశ్చిమ- వాయువ్య దిశగా కదిలి ఆగస్టు 30న ఉదయం 8.30 గంటలకు ఉత్తర ఏపీ, దక్షిణ ఒడిశా ప్రాంతంపై బాగా బలపడి తీవ్ర అల్ప పీడనంగా మారింది. ఇది వచ్చే 36 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారుతుంది. 

సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇపపుడు లోతైన అల్ప పీడన కేంద్రం కచ్ తీరం, పాకిస్థాన్, ఈశాన్య అరేబియా సముద్రం, మాలెగావ్, బ్రహ్మపురి పరిసర ప్రాంతాలు, జగదల్ పూర్, కళింగపట్నం గుండా, ఆపై ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య, ఆనుకొని వాయువ్య బంగాళాఖాతం వద్ద గల అల్పపీడనం నుంచి వెళ్తుంది.

ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.  భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
5000 Note in New Year: 2025లో  రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
2025లో రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
Kodali Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Embed widget