Weather Latest Update: తెలంగాణలో నేడు కూడా వర్షాలు, ఈ జిల్లాల్లో భారీ గాలులు - ఐఎండీ
Weather News: ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల, రేపు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
Weather Latest News: ద్రోణి/గాలి విచ్చిన్నతి ఒకటి సౌరాష్ట్ర కచ్ వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న మరాత్వాడా, పరిసర మధ్య మహారాష్ట్ర ప్రాంతాల వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఈరోజు బలహీన పడిందని తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల, రేపు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు
ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో మోస్తారు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. మరికొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. రేపు కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.9 డిగ్రీలుగా నమోదైంది. 57 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములుతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. వేడి తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.