అన్వేషించండి

Weather Latest Update: నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ

Weather Forecast: ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.

Weather Latest News: నిన్న ఈశాన్య రాజస్థాన్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా దక్షిణ మరియు ఆగ్నేయ దిశల నుండి వీస్తు్న్నాయి.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)

ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. 

వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)

ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.

ఇక్కడ ఎల్లో అలర్ట్
మే 10న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ.) కూడిన వర్షాలు తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల ఈదురు గాలులు గంటకు 6 - 8 కిలో మీటర్ల నుంచి 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలుగా నమోదైంది. 55 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: నిన్న ఈశాన్య రాజస్థాన్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తమిళనాడు మీద సగటు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తు్న్నాయని తెలిపారు.

ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. 

దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందజేసిన సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందజేసిన సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Actress Hema in Bangluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ గురించి హేమ సంచలన వీడియో విడుదల | ABPTadipatri Tension |తాడిపత్రిలో ఈరోజు ఏం జరగనుంది..? | ABP DesamIranian President Ebrahim Raisi Dies | కూలిన హెలికాఫ్టర్..మృతి చెందిన ఇరాన్ అధ్యక్షుడు | ABP DesamChiranjeevi About Getup Srinu’s Raju Yadav Movie | రాజు యాదవ్ సినిమాపై చిరంజీవి రియాక్షన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందజేసిన సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందజేసిన సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
TS ECET - 2024 Results: తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి
TS ECET - 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, 95.86 శాతం ఉత్తీర్ణులు - ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి
Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
Nellore News: కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
Embed widget