అన్వేషించండి

Warangal: వరంగల్‌లో ఈ బ్రదర్స్‌ రూటే సపరేటు! ఒకరు ఓటమి ఎరగలేదు, ఇంకొకరు గెలుపు రుచిచూడలేదు!

Errabelli Brothers News: ప్రత్యక్ష ఎన్నికల్లో కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు మాస్ లీడర్ గా విజయ ఢంకా మోగిస్తుంటే, ఆయన సోదరుడు ప్రదీప్ రావు పార్టీలు మారుతూ విజయాన్ని నమోదు చేసుకోలేకపోతున్నారు.

Telangana Elections News: వారిద్దరూ సొంత అన్న దమ్ములు. ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వారే ఎర్రబెల్లి దయాకర్ రావు బ్రదర్స్. ప్రత్యక్ష ఎన్నికల్లో కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు మాస్ లీడర్ గా విజయ ఢంకా మోగిస్తుంటే, ఆయన సోదరుడు ప్రదీప్ రావు పార్టీలు మారుతూ విజయాన్ని నమోదు చేసుకోలేకపోతున్నారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరులు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణలో తెలియని వారు ఉండరు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు డీలర్ గా తన జీవితాన్ని ప్రారంభించి.. తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. మాస్ లీడర్ గా ఇప్పటివరకు అపజయం లేకుండా ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వర్ధన్నపేట నియోజకవర్గం నుండి 1994లో ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేసి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి ఎర్రబెల్లి వరదరాయేశ్వరరావు పై విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో సైతం ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి అభ్యర్థిగా విజయం సాధించి వర్ధన్నపేట నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ కొట్టాడు. ఈ నియోజకవర్గం నుండి వరుసగా హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఎమ్మెల్యే దయాకర్ రావు. 

పాలకుర్తికి షిఫ్ట్
2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో దయాకర్ రావు జనరల్ స్థానమైన పాలకుర్తికి షిఫ్ట్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గం లో సైతం 2009లో టిడిపి అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు. 2014 ఎన్నికలలో సైతం టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. పాలకుర్తి నియోజకవర్గం లో సైతం వరుసగా మూడుసార్లు గెలిచి నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2008 ఉపఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు ఎర్రబెల్లి దయాకర్ రావు. 1994 నుండి 2023 వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధిస్తూ ఓటమెరుగని నేతగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

ఒక్కసారీ గెలవని సోదరుడు

ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయాల్లో ఓటమిరుగని నేతగా కొనసాగుతుంటే.. ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లో విజయం సాధించలేక పోతున్నారు.  వ్యాపారంలో, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొనసాగిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. ప్రదీప్ రావు ఒకే పార్టీలో నిలకడగా ఉండరు. 2008 చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి పరిస్థితుల్లో  పీఆర్పీ లో కొనసాగలేక 2013లో తెలంగాణ నిర్మాణ సమితిలో చేరారు. ఆ పార్టీకి కూడా ప్రజాదరణ లేకపోవడంతో కొద్దీ రోజులకే టీఅర్ఎస్ లో చేరారు. 

2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన ప్రదీప్‌రావు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే పార్టీ అధిష్టానం తనకు కీలక పదవి కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే నరేందర్‌కు లేదా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు లేదా ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారని భావించిన ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరారు. వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థి గా ప్రదీప్ రావు పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీ ఉన్న తూర్పు లో ప్రదీప్ రావు విజయం అనుమానమే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Cultivating Positivity : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
World Travel Market: లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
Embed widget