అన్వేషించండి

Police Physical Events: రేపటి నుంచి ఫిజికల్ ఈవెంట్స్, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్న వరంగల్ సీపీ

ఫిబ్రవరి 23వ తేది వరకు హనుమకొండ లోని కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించనున్న రెండవ విడత స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుళ్ళు, సబ్ ఇన్స్ స్పెక్టర్ల దేహ దారుఢ్య పరీక్షల ప్రక్రియ ప్రారంభమవుతాయి.

Police Constable Sub Inspector Physical Events: వరంగల్:  పూర్తి పారదర్శకంగా శారీరక దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషర్ ఏ.వి రంగనాథ్ తెలిపారు. రేపటి నుండి ఫిబ్రవరి 23వ తేది వరకు హనుమకొండ లోని కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించబడే రెండవ విడత స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుళ్ళు, సబ్ ఇన్స్ స్పెక్టర్ల దేహ దారుఢ్య పరీక్షల ప్రక్రియ ప్రారంభమవుతాయి. 8 రోజుల పాటు నిర్వహించే ఈ పరీక్షల్లో మొత్తం 8703 అభ్యర్థులు హాజరవుతుండగా ఇందులో 6281 మంది పురుషులు అభ్యర్థులు, 2422 మంది మహిళా అభ్యర్థులు పాల్గొంటున్నారు. మహిళ అభ్యర్థులకు ఈ నెల్ 16, 17 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 
ఈ ఫిజికల్ ఈవెంట్స్ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతాయని - ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని లేదా మీకు ఉద్యోగం వచ్చే విధంగా సహాయం చేస్తామని అభ్యర్థులు దళారీల మాటలను నమ్మి మోసపోవద్దని, ఏవరైన వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడినట్లుగాని లేదా మాల్ ప్రాక్టీస్ పాల్పడుతున్నట్లుగా సమాచారం అందితే వరంగల్ పోలీస్ కమిషనర్ నంబర్ 871285100కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. అలాగే ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది సూచనలు పాటించాల్సిందిగా పోలీస్ కమిషనర్ అభ్యర్థులకు సూచనలు చేశారు. 

1. రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి వారు జారీ చేసిన అనుమతి / సమాచార పత్రం (అడ్మిట్ కార్డ్) ఇంటిమేషన్ లేటర్ తమ వెంట తీసుకరావాలి. 

2. అభ్యర్థి స్వీయ సంతకముతో కూడిన పార్టు 2 ధరఖాస్తు ఫారం, ప్రింట్, కలిగిన మాజీ సైనిక దృవీకరణ పత్రం( పి.పి.టి / డిస్ఛార్జ్ బుక్ ), నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ( ఇంకా సర్వీసు నుండి డిస్చార్జ్ కానివారికి), తేది 12-06- 2018 ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 24, ట్రైబల్ వెల్ఫేర్ ( ఎల్.టి.ఆర్ -1) జారీచేసిన ఏజెన్సీ ఏరియా: సర్టిఫికేటును అభ్యర్థులు తమ వెంట తీసుకరావల్సి ఉంటుంది.

3. పురుషు అభ్యర్థులకు 1600 మీటర్ల వరుగు, మహిళలు 800 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు

4. ఈ పరుగులో అర్హత సాధిస్తేనే ఎత్తు కొలతలు, లాంగ్ జంప్ పరీక్షలకు అభ్యర్థులు అర్హత సాధిస్తారు.

5. అభ్యర్థులు నిర్ధేశించిన తేదీల్లో ఉదయం ఐదు గంటలోపు శారీరక మరియు దేహాదారుఢ్య పరీక్షలకు హజరాల్సి వుంటుంది. అభ్యర్థులు సమయానికి రానిచో అభ్యర్థిత్వం రద్దు అవుతుంది. అభ్యర్థులు

6. ధరింపజేసిన రిస్ట్ బ్యాండ్ ను తొగించడంగాని, డ్యామేజ్ చేయడం చేస్తే వారిని అనర్హులుగా ప్రకటించడం.. జరుగుతుంది. 6. అభ్యర్థులు పరీక్ష నిర్వహణ కేంద్రంలోకి ప్రవేశించిన అనంతరం అన్ని రకాల పరీక్షలు ముగిసిన తరువాతనే మైదానం నుండి బయటకు వెళ్ళేందుకు అనుమతినిస్తారు.

7. అభ్యర్థులు మైదానంలో తమ సామన్లు భద్రపర్చుకోనేందుకుగాను ఎలాంటి క్లాక్రీములు అందుబాటులో ఉండవు. కావున అభ్యర్థులు తమ వెంట దుస్తులు, ఆహార పానీయాలు వంటి అత్యవసరమైనవి మినహాయించి ఎటువంటి విలువైన వస్తువులు, బంగారు అభరణాలు లేదా నిషేధిత వస్తువులు ,సెల్ఫోన్ , ఎటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు, వస్తువులను పరీక్షలు జరిగే మైదానంలోకి అనుమతించరు. ద్విచక్ర వాహనాల ద్వారా వచ్చే అభ్యర్థులు కాకతీయ విశ్వవిధ్యాలము మొదటి ద్వారం వద్ద పార్కింగ్ చేసుకోని కాలినడకన దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించబడే మైదానికి చేరుకోవాల్సి వుంటుంది. 

8. బయోమెట్రిక్ వద్దతిలో అభ్యర్థుల పరిశీలన ఉన్నందున అభ్యర్థులు చేతి వేళ్లకు గోరింటాకు లేదా ఇతర రంగువేసుకొని రావద్దు.

9. అభ్యర్థులు ప్రతి ఈవెంట్ వద్ద మరియు ధృవ పత్రాల పరిశీలన కేంద్రాల వద్ద ఓర్పుతో క్యూ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. పరీక్ష నిర్వహణలో ప్రతి అభ్యర్థి అధికారుల సూచనలను పాటిస్తూ ఆత్మ విశ్వాసంలో ఈ పరీక్షలో పాల్గొని విజయం సాధించాలని ఈ పరీక్షలకు హజరవుతున్న అభ్యర్థులకు పోలీస్ కమిషనర్ బెస్ట్ అఫ్ లక్ తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget