By: ABP Desam | Updated at : 19 Dec 2022 07:40 PM (IST)
Edited By: jyothi
దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిల్లోనే ఉంది: కైలాష్ సత్యర్థి
Kailash Sathyarthi: వరంగల్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఏ నేచర్ అండ్ ఫ్యూచర్ అంశంపై జరిగిన సభలో నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహిత కైలాష్ సత్యార్థి పాల్గొన్నారు. చిన్నారుల చదువుపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కైలాష్ సత్యార్థితో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కలెక్టర్ రాజీవ్ హన్మంత్ లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైలాష్ సత్యార్థి పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
కలలు కనండి, ఆ కలలు సాకారం చేసుకోవడానికి కష్ట పడండని విద్యార్థులకు సూచించారు. ప్రతీ ఒక్కరూ కష్టపడితే నోబెల్ పురస్కారం పొందడం కష్టమేమీ కాదని వివరించారు. మీ కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఆలోచించాలని పిలుపునిచ్చారు. కష్ట పడితేనే కలలు నిజం అవుతాయన్న కైలాష్... దేశం ఒక్కటే, ప్రజలంతా ఒక్కటేనని చాటి చెప్పారు. ఉన్నతమైన కలలు కనండి, ఆ కలలు సాకారం చేసుకోవడానికి కష్ట పడండని హితవు చేశారు. కుల, మతాల, ధనిక పేదలకు అతీతంగా అందరూ పాఠశాలకు వెళ్లి, చదువుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్ కు హీరోలు మీరేనని.. మత సామరస్యాన్ని దేశ సమైక్యతను చాటండని విద్యార్థులకు తెలిపారు. సమాజ బాగుకోసం పని చేయండని, ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని అన్నారు. బాల కార్మిక వ్యవస్థను అందరం కలిసి నిర్మూలిద్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.
తెలంగాణలో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంది..
చిన్నారుల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తి కైలాష్ సత్యార్థి అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణలో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, గ్రామీణ ప్రాంత పిల్లల చదువు కోసం సీఎం కేసీఆర్ వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. పిల్లల హక్కులను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న వినోద్ కుమార్... దేశం బాగుచేయటం కోసం ఒక మంచి నాయకుడు అవసరమన్నారు. ఆ నాయకుడు మీ నుంచే ఒకొక్కరుగా ముందుకు రావాలని చెప్పారు.
కోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన కలైష్ సత్యార్థి
వరంగల్ జిల్లా కోర్టుకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఉజ్జల్ భూయాన్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థిలు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ... దేశంలో బాలలపై లైంగిక నేరాలు తగ్గాలన్నారు. అందుకు త్వరగా న్యాయం జరిగేందుకు ప్రత్యేక న్యాయ స్థానాలు ఏర్పాటు చేయాలన్నారు. నేరాల అదుపు చేయడానికి పొక్సో కోర్టులు ఏర్పాటు చేయటం అభినందనీం అమన్నారు. కొవిడ్ తరువాత మరింత బాలలపై నేరాలు పెరుగుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ... బాలలపై లైంగిక దాడులను ఖండించాలన్నారు. తెలంగాణలో మంచి పథకాలు అమలు చేస్తున్నందుకు తెలంగాణ సర్కార్ కి అభినందనలు తెలిపారు. కోర్టు సందర్శించిన అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జిల్లా న్యాయ మూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులను శాలువలతో ఘనంగా సన్మానించారు.
TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా
Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ
MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత