By: ABP Desam | Updated at : 28 Aug 2022 08:55 AM (IST)
వరంగల్ సభ ఊహించని సక్సెస్
JP Nadda: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. జేపీ నడ్డా పాల్గొన్న ఈ సభ ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ అయిందని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పై నడ్డా విమర్శలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ను గద్దె దించి ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామ యాత్ర లక్ష్యమని బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా అన్నారు. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని, అందుకే ఈ సభను అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారని జేపీ నడ్డా విమర్శించారు. 'దుబ్బాక, హుజూరాబాద్ లో కేసీఆర్ కు చుక్కలు చూపించాం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కు చుక్కలు కనిపించేలా చేస్తాం. వరంగల్ సభను అడ్డుకోవాలని చాలా ప్రయత్నించారు. సభకు ఒక రోజు ముందు అనుమతి రద్దు చేశారు. హైకోర్టును ఆశ్రయించి సభకు అనుమతి పొందాం. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి చాలా నిధులు అందుతున్నాయి. కానీ రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారే వాటిని ఖర్చు చేయడం లేదు. జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు రూ.3,500 కోట్లు ఇవ్వగా.. రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారు. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టుకు రూ. లక్షా 40 వేల కోట్లకు పెంచి భారీగా అవినీతి చేశారు. ఇంత స్థాయిలో అవినీతి చేశారు కాబట్టే కేసీఆర్ కు బీజేపీ అంటే భయం పట్టుకుంది' అని జేపీ నడ్డా విమర్శించారు.
గ్లామర్ అద్దుతున్న బీజేపీ!
వరంగల్ బహిరంగ సభకు వచ్చిన జేపీ నడ్డా.. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో బస చేశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. హీరో నితిన్ జేపీ నడ్డాను కలిశారు. అయితే నితిన్ నడ్డాను కలవడం చిత్ర సీమలో, రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో మోదీ కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా నితిన్ అన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఈరోజు ప్రముఖ తెలుగు నటుడు @actor_nithiin కలవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాం. నితిన్ తన రాబోయే సినిమాల గురించి కూడా చెప్పాడు. అతనికి శుభాభినందనలు తెలియజేసాను. pic.twitter.com/PGyzPaXIoT
— Jagat Prakash Nadda (@JPNadda) August 27, 2022
అంతకుముందు ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జేపీ నడ్డాతో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. టీమిండియా మాజీ క్రికెటర్ రాజకీయ నాయకులతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మిథాలీ రాజ్ కూడా.. బీజేపీ తరఫున పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
Had a great interaction with former Cricketer @M_Raj03. It was humbling to note her appreciation about the fillip that the sportspersons are getting under the leadership of Hon. PM Shri @narendramodi. She hailed the instrumental personal support & guidance provided by Hon Modi Ji pic.twitter.com/TyI58o29ZB
— Jagat Prakash Nadda (@JPNadda) August 27, 2022
ఈమధ్యే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల పాటు వారు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న బీజేపీ.. దానికి గ్లామర్ ను కూడా జోడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే... సినీ హీరోలు, క్రికెటర్లను కలుస్తున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు.
Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!
TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!
TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్