Warangal News: కోవిడ్ తర్వాత బాలలపై మరింతగా నేరాలు పెరుగుతున్నాయి - కైలాష్ సత్యార్థి
Warangal News: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థిలు వరంగల్ కోర్టుకు వచ్చారు.
Warangal News: నైతిక విలువలతో కూడిన న్యాయాన్ని అందజేసినప్పుడే సార్ధకత ఉంటుందని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయ పడ్డారు. బాబా సాహేబ్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ఔన్నత్వాన్ని చాటేలా న్యాయమూర్తుల తీర్పులు ఉండాలన్నారు. ఈరోజు వరంగల్ జిల్లా కోర్టుకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఉజ్జల్ భూయాన్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థిలు వచ్చారు. అయితీ వీరికి అధికారులు, న్యాయ మూర్తులు, న్యాయవాదులు, అర్చకులు.. పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావ్, నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్ధి, వరంగల్ కోర్టు ఆవరణలో ఆధునికరించిన పోక్సో కోర్టు, పది కోర్టుల సముదాయాన్ని సందర్శించారు. కోర్టులో భవన సముదాయాలు బాగున్నాయంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సును జ్యోతి ప్రజ్వళన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ లు, జిల్లా కలెక్టర్లు, న్యాయ మూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
దేశంలోనే వరంగల్ కోర్టు నెంబర్ వన్
దేశంలోనే వరంగల్ కోర్టును నెంబర్ వన్ గా తీర్చిదిద్దామన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు.. ఫ్యామిలీ కోర్టులో అన్ని వసతులు సమకూర్చామన్నారు. బాలల సంక్షేమం కోసం పాటు పడతామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ప్రసవాల్లో మరణాలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తోందరలోనే బాల రక్షక వాహనాలు అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు.
దేశంలో బాలలపై లైంగిక నేరాలకు ప్రత్యేక న్యాయస్థానాలు
దేశంలో బాలలపై లైంగిక నేరాలు తగ్గాలన్నారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి. అందుకు త్వరగా న్యాయం జరిగేందుకు ప్రత్యేక న్యాయ స్థానాలు ఏర్పాటు చేయాలన్నారు. నేరాల అదుపు చేయడానికి పొక్సో కోర్టులు ఏర్పాటు చేయటం అభినందనీం అమన్నారు. కొవిడ్ తరువాత మరింత బాలలపై నేరాలు పెరుగుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ... బాలలపై లైంగిక దాడులను ఖండించాలన్నారు. తెలంగాణలో మంచి పథకాలు అమలు చేస్తున్నందుకు తెలంగాణ సర్కార్ కి అభినందనలు తెలిపారు.
బాలల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం..
బాబా సాహేబ్ అంబేద్కర్ ఎంతో కష్ట పడి రాజ్యాంగాన్ని రచించారని... అ ఫలాలు అందరికి అందజేయటంలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని రాష్ర్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ అన్నారు. కైలాష్ సత్యార్థి బాలల హక్కుల పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతామని అన్నారు. పోక్సో కోర్టుల ఇంకా మిగిలిన జిల్లాల్లో నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ జరగాలని, లైంగిక దాడులకు గురైన వారికి అందరూ బాసటగా నిలవాలని చెప్పారు. వారిలో మనో ధైర్యాన్ని నింపాలన్నారు. లైంగిక దాడులకు సంబంధించిన వార్తలు ఇచ్చేటప్పుడు పాత్రికేయులు జాగ్రత్తలు పాటించాలన్నారు. కోర్టు సందర్శింన అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జిల్లా న్యాయ మూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులను శాలువలతో ఘనంగా సన్మానించారు.