Kakatiya University: హన్మకొండ కాకతీయ వర్సిటీలో ఉద్రిక్తత, బీభత్సం చేసిన విద్యార్థి సంఘం నేతలు
యూనివర్సిటీ అధికారులు కూడా సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకుంటామని కేయూ జేఏసీ నేతలు తేల్చి చెప్పారు.

హన్మకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం (మార్చి 29) యూనివర్సిటీలో నేడు జరగాల్సిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ వాయిదా పడడం ఇందుకు కారణం అయింది. ఆ సభ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు నిరసనకు దిగారు. వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఛాంబర్‌లోకి దూసుకెళ్లారు. దాంతో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదురుగా ధర్నా చేశారు. యూనివర్సిటీ అధికారులు కూడా సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకుంటామని కేయూ జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ వద్ద మహా ధర్నాకు దిగిన వారు.. కొంతమంది గేటు వద్ద టైర్లకు నిప్పు అంటించేందుకు ప్రయత్నించారు. ఇంకొంత మంది పూల కుండీలను పగలగొట్టారు.
ఈ నిరసనకు భారీగా విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థులు మరింత మంది వస్తుండగా వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
Before You Go
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
ట్రెండింగ్ వార్తలు






















