అన్వేషించండి

Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపాయి. మైనింగ్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలని మావోయిస్టు నేత అశోక్ పేరుతో ఇవి వెలిశాయి. దీంతో సరిహద్దుల్లో భద్రతా బలగాలు నిఘా పెంచాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భద్రతా బలగాలు అప్రమత్తమై సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం చేశాయి.

Gadchiroli News: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలో మరోసారి మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా మావోయిస్టుల ప్రభావం తగ్గిందని భావిస్తున్న తరుణంలో, తాజాగా వెలుగుచూసిన కరపత్రాలు భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేశాయి. ముఖ్యంగా ఎటపల్లి తాలూకాలో జరుగుతున్న మైనింగ్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు గళం విప్పారు.ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దీంతో భద్రతా బలగాలు నిఘా పెంచాయి.   

గడ్చిరోలిలో మైనింగ్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు పోస్టర్లు

గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి తాలూకా పరిధిలో ఉన్న జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల్లో మావోయిస్టులకు సంబంధించిన కరపత్రాలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ కరపత్రాలను మావోయిస్టు నేత కామ్రేడ్ అశోక్ పేరుతో వెలిశాయి. ప్రధానంగా మైనింగ్ కంపెనీల తీరును తప్పుబడుతూ వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న మైనింగ్ ప్రాజెక్టులను గ్రామ సర్పంచ్‌లు, స్థానిక ప్రజలు అడ్డుకోవాలని కోరారు.

గడ్చిరోలిలో మైనింగ్ ఆపాలని డిమాండ్

గడ్చిరోలి జిల్లా అటవీ సంపదతోపాటు ఖనిజ సంపద విస్తారంగా ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఐరన్‌ ఓర్‌ ఉంది. దీంతో మైనింగ్ ప్రాజెక్టులను విస్తరించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది పర్యావరణానికి, గిరిజనులకు నష్టాన్ని కలిగిస్తుందని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. అందుకే మైనింగ్ ప్రాజెక్టులు పూర్తిగా నిలిపివేయాలి అనే నినాదంతో పోస్టర్లు వేశారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భద్రతా బలగాలు హై అలర్ట్

ఈ కరపత్రాలు ఎటపల్లి తాలూకాలోని ప్రధాన సరిహద్దు గ్రామాల్లో కనిపించాయి. గడ్చిరోలి-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం మొన్నటి వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ప్రభుత్వాలు ప్రకటించాయి. గడ్చిరోలిలో మావోయిస్టులు పూర్తిగా అంతమయ్యారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ లేఖలు విడుదల కావడం ఆందోళనకలిగిస్తున్నాయ. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి యత్నిస్తున్నారని ఈ పోస్టర్లు చూస్తుంటే అర్థమవుతోంది.  

అనుమానితుల కదలికలపై నిఘా 

మావోయిస్టుల కరపత్రాల వెలుగులోకి రావడంతో భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. గడ్చిరోలి జిల్లాతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను మరింత కఠినతరం చేశారు. భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. అనుమానిత కదలికలపై నిఘా ఉంచారు.  

టెన్షన్ పడుతున్న ప్రజలు 

గడ్చిరోలి ప్రాంతంలో మైనింగ్ దశాబ్దాలుగా వివాదాస్పద అంశంగా ఉంది. ఒకవైపు ప్రభుత్వం మైనింగ్ ద్వారా ఉపాధి, అభివృద్ధి వస్తుందని చెబుతుంటే, మరోవైపు మావోయిస్టులు పర్యావరణ విధ్వంసం, గిరిజన నిర్వాసితుల అంశాన్ని ఎత్తిచూపుతున్నారు. మావోయస్టుల పార్టీ పూర్తిగా అంతరించిందని భావిస్తున్న ప్రజలకు ఈ పత్రాలు టెన్షన్ పెడుతున్నాయి.  

Frequently Asked Questions

గడ్చిరోలిలో మైనింగ్ ఎందుకు వివాదాస్పద అంశంగా మారింది?

ప్రభుత్వం మైనింగ్‌తో అభివృద్ధి వస్తుందని చెబుతుండగా, మావోయిస్టులు పర్యావరణ విధ్వంసం, గిరిజన హక్కుల ఉల్లంఘనను ఎత్తిచూపుతున్నారు. జిల్లాలో విస్తారమైన ఐరన్ ఓర్ ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Woman Dies: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి నీటి నిల్వ
కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి నీటి నిల్వ
Sandeep Reddy Vanga : వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్ రెడ్డి వంగా - సీఎం రేవంత్ 'స్పిరిట్' రిప్లై... డైరెక్టర్ వెరీ హ్యాపీ
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్ రెడ్డి వంగా - సీఎం రేవంత్ 'స్పిరిట్' రిప్లై... డైరెక్టర్ వెరీ హ్యాపీ
Advertisement

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget