అన్వేషించండి

Kothagudem Earthquake: భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. అర్ధరాత్రి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

Earthquake in Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదైనట్లు NCS తెలిపింది.

Kothagudem Earthquake | కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వల్ప భూకంపం సంభవించింది. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 14 (ఆదివారం) తెల్లవారుజామున దాదాపు 2:26 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి సమయం కావడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భూ ప్రకంపనలకు ఉలిక్కి పడి నిద్రలేచారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి వాయువ్య దిశగా సుమారు 111 కిలోమీటర్ల దూరంలో, భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అర్ధరాత్రి వేళ భూమి కదులుతున్నట్లు అనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు రావడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. 

సాధారణంగా రిక్టర్ స్కేలుపై 3.5 కంటే తక్కువ తీవ్రత నమోదైతే భూకంపం సంభవించినట్లు అంతగా అనిపించదు, కానీ పరికరాల ద్వారా రికార్డవుతుంది. 3.5 నుండి 5.4 మధ్య తీవ్రత నమోదైతే ప్రజలకు భూకంపం వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది, కానీ పెద్దగా నష్టం జరగదని అధికారులు తెలిపారు.

Also Read: Singareni Jobs: సింగరేణిలో కార్మికులకు రూ. 1 కోటి 25 లక్షల భారీ బీమా సౌకర్యం - కాంట్రాక్ట్ సిబ్బందికీ బోనస్ - మంత్రుల కీలక ప్రకటన

ఫిబ్రవరిలో మేడ్చల్ జిల్లాలో భూకంపం..

సాధారణంగా తెలంగాణలో భూకంపాల తీవ్రత తక్కువగానే ఉంటుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 10న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భూకంపం సంభవించింది. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం, ఆదర్శనగర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని భయపడి ప్రజలు తమ ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ముఖ్యంగా స్కూల్లో ఉన్న చిన్నపిల్లలు తీవ్ర భయాందోళనల మధ్య క్లాస్ రూమ్స్ నుంచి బయటకు వచ్చారు. భూప్రకంపనలతో ఆ పరిధిలోని స్కూళ్లకు సెలవు ఇచ్చి, విద్యార్థులను ఇళ్లకు పంపించివేయడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆ సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

అయితే, 2025 ఆగస్టు 14న వికారాబాద్ జిల్లా, దాని పరిసర ప్రాంతాలలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం (NCS) తెలిపిన వివరాల ప్రకారం.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు సంభవించాయి.

Also Read: Mancherial Latest News: బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget