అన్వేషించండి

Warangal Politics : రాజకీయ యాత్రలకు కేంద్రంగా వరంగల్, పాదయాత్రలతో నేతలు బిజీ

Warangal Politics : పోరాటాల గడ్డ ఓరుగల్లును పాదయాత్రలు చుట్టుమట్టాయి. ప్రతిపక్షపార్టీల నేతల పాదయాత్రలకు జిల్లా కీలకంగా మారింది.

Warangal Politics :  ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే రాజకీయ చైతన్యం. పోరాటాలకు అడ్డా. అలాంటి జిల్లా ఇప్పుడు రాజకీయ యాత్రలకు నిలయంగా మారింది. కొద్ది నెలల క్రితం బీజేపీ నేడు కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ పాదయాత్రలు చేస్తున్నాయి. వరంగల్ జిల్లాలో రాజకీయ యాత్రలు చుట్టుముట్టాయి.

అధికార పార్టీ అసలు టార్గెట్

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ యాత్రలు ఏ పార్టీకి లాభమో... నష్టమో తెలియదుగానీ పోటా పోటీగా యాత్రలు చేస్తున్నాయి ఆయా పార్టీలు. అయితే రాజకీయాత్రలకు వరంగల్ జిల్లాలో సాగుతున్న యాత్రలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.  ములుగు జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర పేరు జనాల్లోకి వెళ్తూ అధికారపార్టీని టార్గెట్ చేస్తూ యాత్రను కొనసాగిస్తుంది.

10 నెలల ముందే హడావుడి

 ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ కాలపరిమితి ఇంకా 10 నెలలు ఉన్నప్పటికీ  అప్పుడే ఎన్నికలు వచ్చాయి అనే స్థాయిలో ఉమ్మడి  వరంగల్ జిల్లాలో  యాత్రలతో రాజకీయ వేడి అలుముకుంది. గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రధానంగా విమర్శలు చేస్తూ ప్రజలను తమ వైపు ఆకర్శించే విధంగా ఇటు షర్మిల... అటు రేవంత్ రెడ్డి ప్రసంగాలు చేస్తున్నారు. ములుగు జిల్లా నుంచి యాత్రను ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాజకీయ విమర్శలే కాదు.. ఏకంగా బాంబు దాడులు పేరిట సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ ను పేల్చి వేయాలంటూ రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఓ బాధ్యత గల ప్రజా ప్రతినిధి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్లాగా వ్యాఖ్యలు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ సభ, సమావేశం నిర్వహించిన జనాలు భారీగానే వస్తున్నప్పటికీ, ఎన్ని మాటల దాడులు చేసినా అవి ఓట్ల రూపంలో మలుచుకోవడంలో విఫలమవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

షర్మిల పాదయాత్ర

 ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైస్ షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాత్రను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో అనుమతులు లేవంటూ నిలిచిన యాత్రను  కోర్టు ఆదేశాలతో తిరిగి మొదలుపెట్టారు. షర్మిలకు జిల్లాలోని ఏ ప్రాంతానికి వెళ్లి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. షర్మిల యాత్ర ప్రధానంగా ప్రభుత్వ పథకాలు, అమలుపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, మూడేకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణంపై ప్రశ్నలు సందిస్తూ ప్రజలను ఆలోచింపజేసే విధంగా యాత్ర సాగిస్తోంది. అంతేకాదు అధికార పార్టీ ఎమ్మెల్యే లు, ముఖ్యనేతలపై సవాళ్లు విసురుతున్నారు.  వైఎస్ఆర్ అభిమానులు, రెడ్డి, క్రిస్టియన్ ఓట్లు తన వైపు తిప్పుకోవడానికి వైస్ షర్మిల పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్ని సీట్లలో పోటీచేస్తారో తెలియదు కానీ యాత్ర మాత్రం విజయవంతంగా సాగుతుందని విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీ యాత్రతో పొలిటికల్ హిట్

కొన్ని నెలల క్రితం జరిగిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాత్ర సైతం వరంగల్ జిల్లాలో వాడి వేడిగా సాగింది. ఏ రాజకీయ పార్టీ యాత్రలు చేసినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాత్ర కొంసాగింపును సవాలుగా తీసుకొని యాత్రలను విజయవంతం చేస్తున్నాయి. యాత్రలు విజయవంతంగా సాగుతున్నా అధికారపార్టీని తట్టుకొని యాత్రలకు వచ్చిన జనాల ఓట్లను అధికారపార్టీని కాదని మల్చుకుంటాయా అనేది ప్రశ్నగా మిగిలింది. ఓట్లను పక్కన పెడితే ఓ సినిమా యాక్టర్ ను చూడటానికో... ప్రసంగం వినటానికో వచ్చినట్టు జనాలు వస్తున్నారు. కానీ ఎన్నికల్లో మాత్రం ఓట్లు పడటం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మేజర్ సీట్లు అధికారపార్టీ కైవసం చేసుకుంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే చెబుతున్నారు.

బీఆర్ఎస్ పై మాటల యుద్ధం

ఎన్ని యాత్రలు చేసినా, ప్రభుత్వంపై విరుచుకుపడినా ఓట్లను మల్చుకోలేకపోతున్నాయి ప్రతిపక్షాలు. ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా చేస్తేనే ఇతర రాజకీయ పార్టీలకు భవిష్యత్తు ఉంటుందని లేకుండా బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలను లేకుండా చేస్తుందనే భయంతో అన్ని పార్టీలు బీఆర్ఎస్ పై గురిపెట్టి యాత్రలు చేస్తున్నాయి.  బీజేపీ, కాంగ్రెస్, షర్మిలను ఎలా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా... కేసీఆర్ వ్యతిరేక పార్టీల వ్యూహాలు ఫలిస్తాయో... వేచిచూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Mahindra Scorpio: భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
Embed widget