By: ABP Desam | Updated at : 29 Mar 2022 10:45 AM (IST)
వికారాబాద్ బాలిక హత్య కేసు
వికారాబాద్ జిల్లాకు చెందిన మైనర్ బాలిక హత్య, అత్యాచారం కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. హత్య విషయం వెలుగులోకి రాగానే అదే ఊరిలో ఉండే మైనర్ ప్రియుడు ఆమెను చంపినట్లుగా బయటికి వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా పోలీసుల విషయంలో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఆ బాలికను ఆమె తల్లే చంపినట్లుగా భావిస్తున్నారు. విచారణలో భాగంగా చనిపోయిన బాలిక తల్లిని పోలీసులు ప్రశ్నించగా ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో తల్లి లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలిక హత్య ఆమె ఇంట్లోనే జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటిదాకా నిందితుడిగా భావిస్తున్న మైనర్ ఆ సమయంలో బాలికను కలిసినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. హతురాలి తల్లికి వివాహేతర సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు! అదే బాలిక హత్యకు దారి తీసినట్లుగా అనుమానిస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Also Read: Rape on Boy: 13 ఏళ్ల బాలుడిపై యువకులు దారుణ రేప్, ఆ తర్వాత మరో పైశాచికం!
మరోవైపు, ఘటన జరిగిన రోజు నిన్న (మార్చి 28) బాలిక తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేం పేదోళ్లం. మేం అడుక్కతిని బతికెటోళ్లము. మా పిల్ల ఈడ చిట్టెంపల్లిల పది చదువుతున్నది. మేమెప్పుడు ఒకల్ల దగ్గరికి పోము. మా బతుకు మేం బతుకుతము. మంచి చెయ్యనికి పోతం గానీ, చెడు చెయ్యము. ఆ పిల్లగాడు ఫోన్ల మాట్లాడిండు. అతనే చెసి ఉంటడు’’ అని బాలిక తల్లి మాట్లాడారు.
వికారాబాద్ (Vikarabad) జిల్లా పూడురు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతోంది. ఆ విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకి వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారం చేసి, అంతటితో ఆగకుండా నిందితుడు హత్య కూడా చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బహిర్భూమికి వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు.
నిర్మానుష్య ప్రాంతంలో బాలిక మృతదేహం (Vikarabad Girl Rape) లభ్యం కావడంతో వారు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనకు (Telangana Minor Girl Rape) సంబంధించి ప్రాథమికంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. ప్రియుడిపై విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Mlc Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, కేటీఆర్ కూడా స్పష్టం చేశారు - ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
GHMC: హైదరాబాద్ అభివృద్ది వైపు జీహెచ్ఎంసీ వడివడిగా అడుగులు - టార్గెట్ 2024 జనవరి !
Rani Rudrama on KTR: "మంత్రి కేటీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ - పనిగట్టుకొని విష ప్రచారాలు"
Jeevan Reddy on KCR: 24 గంటల ఉచిత విద్యుత్ ప్రచార ఆర్భాటమే - కేసీఆర్ నిర్ణయంతో 40 వేల కోట్ల నష్టం!
IND vs NZ 3rd T20: శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ - చివరి టీ20లో భారత్ భారీ స్కోరు
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Union Budget 2023: ఇది బ్యాలెన్స్డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం