అన్వేషించండి

VC Sajjanar: టీఎస్ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో రక్తదాన శిబిరం- ప్రతి పౌరుడు ముందుకు రావాలని సజ్జనార్ పిలుపు

VC Sajjanar: ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎస్ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వీసీ సజ్జనార్ తెలిపారు. 

VC Sajjanar: ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎస్ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వీసీ సజ్జనార్ తెలిపారు. ఈరోజు నుంచి వారం రోజుల పాటు ఈ రక్తదాన శిబిరం కొనసాగుతుందన్నారు. అలాగే రక్తదానం చేయాలనుకునే వాళ్లు 9591478666 ఫోన్ నంబర్ ను సంప్రదించాలని కోరారు. రక్తదానం ప్రాణదానంతో సమానం అని వివరించారు. ప్రతి పౌరుడు స్వచ్చంధంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి అండగా నిలవాలన్నారు. 

అలాగే ట్విట్టర్ వేదికగా ఓ ప్రమాద వీడియోను షేర్ చేస్తూ... యూటర్న్ ల వద్ద అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం చాలా డేంజర్ అని చెప్పుకొచ్చారు. మీతోపాటు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడతారని సూచించారు. ప్రయాణికులంతా జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వివరించారు. 

ఇటీవలే ప్రాణాలు కోల్పోయిన కండక్టర్ కు 50 లక్షల ఆర్థిక సాయం 

రోడ్డు ప్ర‌మాదంతో విషాదం అలుముకున్న ఉద్యోగి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. అకాల మృత్యువు వెంటాడిన కండక్టర్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్‌ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జ‌గిత్యాల నుంచి వ‌రంగ‌ల్ వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ బ‌స్సును రాంగ్ రూట్‌లో వ‌చ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మ‌ల్యాల - బ‌ల‌వంతాపూర్ స్టేజీ వ‌ద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండ‌క్టర్ కుటుంబంలో విషాదం అలుముకుంది.

ఈ ఆప‌ద స‌మ‌యంలో యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు బాధిత కుటుంబానికి అక్కర‌కొచ్చింది. సిబ్బంది, ఉద్యోగుల సాల‌రీ అకౌంట్స్‌ను ఇటీవ‌ల యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చింది. ఆర్థిక ప్రయోజ‌నంతో కూడిన సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్‌, రూపే కార్డు తీసుకోవాల‌ని ప్రత్యేక మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. సంస్థ‌లోని ఉద్యోగులంద‌రూ వారు నివ‌సిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ ఖాతా, కార్డు ద్వారా ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఉండ‌టంతో ఉద్యోగుల‌కు ఎంతో ఆర్థిక ప్ర‌యోజ‌నం చేకూరుతోంది. ప్ర‌మాదాలు జ‌రిగిన స‌మ‌యంలో సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేత‌నం ప్ర‌కారం) క‌నీసం రూ.40 ల‌క్ష‌లు, రూపే కార్డు కింద మ‌రో రూ.10 ల‌క్ష‌లను యూబీఐ అందజేస్తోంది.

ఈ మేర‌కు రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన జ‌గిత్యాల డిపో కండక్ట‌ర్ బొల్లం స‌త్త‌య్య కుటుంబానికి రూ.50 లక్షల విలువైన 2 చెక్కుల‌ను యూబీఐ అధికారులతో కలిసి సంస్థ  ఎండీ వీసీ సజ్జనార్‌, ఐపీఎస్‌ మంగ‌ళ‌వారం బ‌స్‌ భ‌వ‌న్‌లో అంద‌జేశారు. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండ‌క్ట‌ర్ సత్తయ్య భార్య బొల్లం పుష్ఫ‌తో పాటు కొడుకు ప్ర‌వీణ్ కుమార్‌, కూతురు మాధ‌వీల‌త‌ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget