అన్వేషించండి

YS Jagan Speech: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం, వైఎస్ జగన్ స్పీచ్ చూశారా!

Telangana Budget 2024 session: కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతూ.. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపిన వీడియోను ప్రదర్శించారు.

Uttam Kumar Reddy Speech In Telangana Assembly: హైదరాబాద్: కృష్ణా నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ విధానాలు, లోపాల వల్లే జల దోపిడీ జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ రాసిన లేఖను ఉత్తమ్ చదివి వినిపించారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు తాము అంగీకరిస్తున్నామని ఆ లేఖలో రాసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని స్పష్టం చేశారు. 

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించింది. ‘తెలంగాణ నుంచి వాళ్లు నీళ్లు కిందకి వదులుతే తప్పా, మనకు నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉందనే కేసీఆర్.. ఓ అడుగు ముందుకేసి తెలంగాణ నుంచి నీళ్లు తీసుకునేందుకు అంగీకరించారు. మొత్తం 8 జిల్లాలు.. అందులో రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా నుంచి పశ్చిమ గోదావరి వరకు కృష్ణా ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. మనం రిక్వెస్ట్ చేయగా తెలంగాణ నుంచి ఏపీ వాళ్లు నీళ్లు తీసుకునేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారని’ ఏపీ సీఎం జగన్ గతంలో మాట్లాడిన విషయాన్ని సభలో ప్రదర్శించారు. మన నీళ్లు ఏపీకి ఇచ్చినందుకు సీఎం జగన్ అప్పటి సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. మనకు రావాల్సిన కృష్ణా జలాలను కేసీఆర్ ఏకపక్షంగా ఏపీకి ఇచ్చేసి, రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు.

YS Jagan Speech: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం, వైఎస్ జగన్ స్పీచ్ చూశారా!

అవి గోదావరి జలాలు కాదు..
గోదావరి జలాల గురించి ఏపీ సీఎం జగన్ మాట్లాడిన విషయాలను కృష్ణా జలాలుగా చిత్రీకరించి సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే మంత్రి ఉత్తమ్ స్పందించి అది కృష్ణా జలాల విషయమని క్లారిటీ ఇచ్చారు. కృష్ణా ఆయకట్టు అని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని, అంటే కృష్ణా నదీ జలాలను తెలంగాణ నుంచి ఏపీకి ఏకపక్షంగా ఇచ్చేశారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాలు ఏపీ నేతలు తీసుకెళ్తే.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందన్నారు. కనుక ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు.  

YS Jagan Speech: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం, వైఎస్ జగన్ స్పీచ్ చూశారా!

ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందన్న హరీష్ రావు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కృష్ణా నదీ జలాలలపై మంత్రి ఉత్తమ్ చేసిన ఆరోపణలపై అభ్యంతరం తెలిపారు. నల్గొండలో ఈ నెల 13న బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ పూర్తిగా అసత్యమైన ప్రజెంటేషన్ ఇచ్చారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ తయారుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Crime News: అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
Sreeleela :ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
Bengaluru: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
Sreemukhi : శ్రీముఖి అంటే పద్ధతి.. పద్ధతి అంటే శ్రీముఖి అన్నట్టు ముస్తాబైంది!
శ్రీముఖి అంటే పద్ధతి.. పద్ధతి అంటే శ్రీముఖి అన్నట్టు ముస్తాబైంది!
Embed widget