Mallareddy : రూ. 30 కోట్ల భూమి కబ్జా - మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు !
మంత్రి మల్లారెడ్డిపై ఇద్దరు వ్యక్తులు భూకబ్జా ఆరోపణలు చేశారు. రూ. 30 కోట్ల భూమిని అక్రమంగా రికార్డుల్లో పేరు మార్చుకున్నారని ఆరోపించారు.
Mallareddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. 30 కోట్ల భూమిని కాజేసేందుకు మంత్రి కుట్ర పన్నారని మర్రి వెంకటరెడ్డి, దయాసాగర్ రెడ్డి అనే వ్యక్తులు ఆరోపించారు. తమపై మంత్రి మల్లారెడ్డి, ఆయన బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి దౌర్జన్యం చేశారని.. తమకు ప్రాణహాని ఉందని వారు ఆరోపించారు.
తమకు పోలీసులు, ప్రభుత్వం న్యాయం చేయాలంటూ.. మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డి లు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మంత్రి మల్లారెడ్డకి చెందిన కాలేజీ ఉంది. ఆ కాలేజ్ ఎదురుగా ఉన్న 8 ఎకరాల భూమి సుంకరి కుటుంబం అధీనం ఉంది. ఆ ఎనిమిది ఎకరాల్లో నాలుగున్నర ఎకరాలు తాము కొనుగోలు చేశామని మర్రి వెంకటరెడ్డి, దయాసాగర్ రెడ్డి చెబతున్నారు. మంత్రి మల్లారెడ్డి తన భార్య కల్పన పెరు మీద 8 ఎకరాల్లో 2 ఎకరాలు కొన్నారని అన్నారు. అయితే మొత్తం భూమి కాజేసేందుకు.. మంత్రి కుట్ర చేస్తున్నారని.. భూమి వద్దకు వెళ్లిన మా పై మంత్రి, ఆయన అనుచరులు దాడి చేశారని ారోపించారు. మంత్రి బామర్ది శ్రీనివాస్ రెడ్డి గన్ తో షూట్ చేస్తామంటూ.. బెదిరించారని వారు ఆరోపిస్తున్నారు. భూమిని వదిలి వెళ్లాలని ఆదేశిస్తున్నారని.. పోలీసులకు పిర్యాదు చేసినా.. రాజకీయ ఒత్తిడి ఉందంటూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భూ రికార్డుల నుండి మా పేరు తొలగించి.. అక్రమంగా మంత్రి వారి పేరు పై మార్చుకున్నారని మర్రి వెంకటరెడ్డి, దయాసాగర్ రెడ్డి ఆరోపిించారు. మా భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేస్తున్నమాని.. మంత్రి మల్లారెడ్డి నుండి మాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించి న్యాయం చేయాలని .. సీఎం కేసీఆర్ కు బాధితులు వివిజ్ఞప్తి చేశారు. మంత్రి మల్లారెడ్డి చాలా మంది రైతులను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై గతంలోనూ భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. పోలీసులు పట్టించుకోకపోవడతో గతంలో ఓ మహిళ కోర్టుకు వెళ్లింది. మే తన స్థలంలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారని శ్యామలాదేవి అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె కుత్బుల్లాపూర్ మండలం సూరారంకు చెందిన మహిళ. మల్లారెడ్డి కబ్జా చేసిన భూమిని విడిపించాలని తాను ఓ లాయర్ ను సంప్రదించానని... ఆ లాయర్ తోనే మల్లారెడ్డి కుమ్మక్కయ్యారని, తప్పుడు పత్రాలను సృష్టించి భూమిని ఆక్రమించారని ఫిర్యాదులో తెలిపారు. ఆమె చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 447, 506 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద మల్లారెడ్డిపై కేసు నమోదైంది.