By: ABP Desam | Updated at : 03 Sep 2021 04:52 PM (IST)
ఎలక్ట్రికల్ చార్జింగ్ స్టేషన్లు
విద్యుత్ వాహనాలను ఉపయోగించే వారికి తెలంగాణ సర్కారు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రాంగణాల్లో ఎలక్ట్రికల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ యోచిస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరంలో ప్రతి 3 కిలోమీటర్లకు ఒకటి.. జాతీయ రహదారులపై 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం గ్రేటర్ జోన్ తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 431 వరకు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ప్రధాన రహదారుల పక్కన, శివారు ప్రాంతాలలో కలిపి సుమారు 200 వరకు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. అలాంటి సబ్‌స్టేషన్లలో ఖాళీ స్థలాలను గుర్తించి అక్కడ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశాలను టీఎస్ రెడ్కో పరిశీలిస్తోంది. దీనిలో భాగంగా కల్యాణ్ నగర్, గచ్చిబౌలి, సరూర్‌నగర్ సర్కిల్, జూబ్లీహిల్స్, సైబర్ సిటీ, నానక్‌రాం గూడ, త్రిపుల్ ఐటీ, మేడ్చల్, రాజేంద్ర నగర్, హబ్సిగూడ పరిధిలోని పలు సబ్‌స్టేషన్లలో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను అధికారులు గుర్తిస్తున్నారు. 2023 నాటికి పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా టీఎస్ రెడ్కో అడుగులు వేస్తోంది.
రూ. 14 నుంచి రూ.20 వరకు..
ప్రైవేట్ కంపెనీలు తాము ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేషన్లలో ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ. 14 నుంచి రూ.20 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. టీఎస్ రెడ్కో అధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే స్టేషన్లలో ధరలు ఇంకా నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ స్టేషన్లలో ప్రస్తుతం ప్రభుత్వ శాఖలో నడుపుతున్న ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే చార్జ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫాస్ట్ చార్జింగ్ (డీసీ), స్లో చార్జింగ్ (ఎ/సీ) అనే రెండు రకాల స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
స్లో చార్జింగ్ స్టేషన్‌లో ఒక్కో వాహనానికి 6 గంటల నుంచి 8 గంటలు.. ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌లో గంటన్నర సమయంలో వాహనాలకు ఫుల్ చార్జింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కాగా.. కర్ణాటక, ఢిల్లీలో డిస్కంలు చార్జింగ్ స్టేషన్లకు ఒక్కో యూనిట్‌కు రూ. 4.50 వసూలు చేస్తున్నారు. అక్కడ ఉన్న చార్జింగ్ స్టేషన్లలో వాహనాలకు ఒక్కో యూనిట్‌కు రూ. 7.50 వరకు వసూలు చేస్తున్నారు.
Breaking News Live Telugu Updates: ఎస్సారెస్పీ కెనాల్ లో పడిపోయిన కారు... యువకుడు మృతి
Telangana: 13 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రుల శంకుస్థాపన, దసరా నాటికి నిర్మాణం పూర్తి
BRS Party : పొంగులేటితో భేటీ, 20 మంది బీఆర్ఎస్ నాయకులపై అధిష్ఠానం వేటు
MP Uttam Kumar Reddy : ఈ నెలలో తెలంగాణ అసెంబ్లీ రద్‌దు, రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు- ఉత్తమ్ కుమార్ రెడ్డి
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
Jr NTR: అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
AP SI Hall Tickets: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?
Vijay Devarakonda: బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ కాంబో రిపీట్ - కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ, పరశురామ్!