అన్వేషించండి

TS bPass : టీఎస్ బీపాస్ అమల్లో అలక్ష్యం, 39 మంది అధికారులకు ఫైన్!

TS bPass : టీఎస్ బీపాస్ అమల్లో అలక్ష్యం వహించిన అధికారులపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. 39 మంది అధికారులకు జరిమానా విధించింది.

 TS bPass :టీఎస్ బీపాస్ అమల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించింది. భవన నిర్మాణ అనుమతుల కోసం అందుబాటులోకి తెచ్చిన టీఎస్ బీపాస్ అమల్లో 39 మంది అధికారులు నిర్లక్ష్యం వహించారని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఫైన్ విధించింది.  వీరిలో  ఆరుగురు హెచ్ఎండీఏ అధికారులు, ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు, 27 మంది స్క్రూటినీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్ బీపాస్ అప్లికేషన్ల పరిశీలన పరిష్కారంలో కొంత మంది అధికారులు తీవ్ర జాప్యం చేశారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.  

ఇప్పటి వరకూ 56 మందిపై ఫైన్ 

హెచ్ఎండీఏలో పనిచేసే ఆరుగురు అధికారులకు జరిమానా విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు పలు జిల్లాల్లో 33 మంది అధికారులకు కలెక్టర్లు ఫైన్  విధించారు. ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు, 27 మంది స్క్రూటినీ అధికారులకు జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020లో టీఎస్ బీపాస్ అమల్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 56 మంది అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించింది. టీఎస్ బీపాస్ అమలు తీరుపై తరచూ సమీక్షలు నిర్వహించాలని  కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

టీఎస్‌ బీ పాస్‌ సేవలు

భవన అనుమతులు, భూమి వినియోగ ధ్రువ పత్రాలు, టీడీఆర్‌ బ్యాంక్‌, లే అవుట్‌, భూ వినియోగ మార్పు, సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ఎన్‌ఓసీలు, ఎల్‌ఆర్‌ఎస్‌, 21 రోజుల్లో అనుమతి సేవలు టీఎస్ బీపాస్ లో అందుబాటులో ఉంటాయి. జలమండలి, ఎలక్ట్రిసిటీ, టీడీఆర్‌, ఎస్‌ఆర్‌ఓ, నీటి పారుదల, జేఎన్‌టీయూ, విమానాశ్రయం, ఎన్‌ఎంఏ విభాగాలకు సంబంధించి ఒకే చోట ఎన్‌ఓసీలు అందజేస్తారు.  

దరఖాస్తు ఇలా చేసుకోండి

టీఎస్‌ బీ పాస్‌ వెబ్‌సైట్‌ www.tsbpass.telangana. gov.inలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యజమానులు, డెవలపర్స్, ప్రతినిధులు మీ సేవ కేంద్రం, టీఎస్‌ బీపాస్‌ మొబైల్‌ యాప్‌ లో నిర్మాణానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ 040-22666666 అందుబాటులోకి తెచ్చారు.  

మూడు కేటగిరిల్లో అనుమతులు   

 75 చదరపు గజాలు (63 చ.మీ) వరకు ఏరియా ఉంటే ప్లాట్లు, 7 మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఉండే భవనానికి తక్షణ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలు, స్వీయ ధ్రువీకరణతో జారీ చేస్తారు.  కేవలం రూపాయి ఫీజుతో యాజమాన్య వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. 63 చ.మీకి పైన, 500 చ.మీ ఏరియా వరకు ఉండే నివాస ప్లాట్లకు , 10 మీటర్ల వరకు ప్రతిపాదించిన భవన ఎత్తు స్వీయ ధ్రువీకరణ విధానం కింద తక్షణ ఆన్‌లైన్‌ లో ఆమోదిస్తారు. 500 చ.మీకి పైన ఉండే నివాస ప్లాట్లు, 10 మీ కన్నా ఎక్కువ ప్రతిపాదించిన బిల్డింగ్‌ ఎత్తు కలిగి ఉండి, అన్ని రకాల నివాసేతర భవనాలకు సింగల్‌విండో ఆమోద విధానంలో అనుమతులు జారీ చేస్తారు. 

Also Read : MIM Akbaruddin Owaisi : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హేట్ స్పీచ్ కేసులో హైకోర్టు నోటీసులు

టాప్ హెడ్ లైన్స్

Raidurgam Hit and Run Incident: రాయదుర్గం హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్
రాయదుర్గం హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్
Weapons Missing In Hyderabad: బొల్లారంలో ఆర్మీ మద్రాస్ యూనిట్లో ఆయుధాలు మిస్సింగ్, సెలవు ఇవ్వలేదని ఉద్యోగి నిర్వాకమా?
బొల్లారంలో ఆర్మీ మద్రాస్ యూనిట్లో ఆయుధాలు మిస్సింగ్, సెలవు ఇవ్వలేదని ఉద్యోగి నిర్వాకమా?
Telangana Congress Politics: ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
Ramchander Rao House Arrest: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్.. రహదారిపై మంత్రి దిష్టిబొమ్మ దహనం
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్.. రహదారిపై మంత్రి దిష్టిబొమ్మ దహనం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raidurgam Hit and Run Incident: రాయదుర్గం హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్
రాయదుర్గం హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్
Weapons Missing In Hyderabad: బొల్లారంలో ఆర్మీ మద్రాస్ యూనిట్లో ఆయుధాలు మిస్సింగ్, సెలవు ఇవ్వలేదని ఉద్యోగి నిర్వాకమా?
బొల్లారంలో ఆర్మీ మద్రాస్ యూనిట్లో ఆయుధాలు మిస్సింగ్, సెలవు ఇవ్వలేదని ఉద్యోగి నిర్వాకమా?
Kotamreddy On Vijayasai Reddy Sajjala Issue: చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana Congress Politics: ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
Vijayawada Crime News: పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Kitchen Sink Drain : కిచెన్​లో సింక్​తో ప్రాబ్లమా? ప్లంబర్ అవసరం లేకుండా ముసుకుపోయిన సింక్ డ్రెయిన్ ఇలా క్లీన్ చేసేయండి
కిచెన్​లో సింక్​తో ప్రాబ్లమా? ప్లంబర్ అవసరం లేకుండా ముసుకుపోయిన సింక్ డ్రెయిన్ ఇలా క్లీన్ చేసేయండి
CM Chandrababu: 31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
Sadhguru Donation to Nepal: నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
Embed widget