అన్వేషించండి

Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?

Donald Trump Impeachment 2026: యూఎస్ మధ్యంతర ఎన్నికల్లో విపక్షాల బలం విపరీతంగా పెరిగిన వేళ డొనాల్డ్ ట్రంప్‌పై ఇంపీచ్‌మెంట్ సాధ్యమేనా?

 US Midterm Election Results Impact Trump:   అమెరికా మధ్యంతర ఎన్నికల   తీర్పుతో వాషింగ్టన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ  తో పాటు సెనేట్‌లోనూ విపక్ష డెమొక్రాట్లు బలం పుంజుకుని ఆధిపత్యం సాధించడంతో, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిపాలనాధికారంపై కాంగ్రెస్ బలమైన పట్టును బిగించింది. ఈ మారిన రాజకీయ సమీకరణాలతో  వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్‌ను  ఇంపీచ్‌మెంట్ ద్వారా అధ్యక్ష పీఠం నుంచి తప్పించవచ్చా అన్న చర్చ అంతర్జాతీయంగా తీవ్ర ఊపందుకుంది.

ఇంపీచ్ చేయవచ్చు..కానీ పదవి నుంచి తొలగించలేరు!   

అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, సెక్షన్ 4 ప్రకారం.. దేశద్రోహం, లంచగొండితనం, ఇతర తీవ్రమైన నేరాలు ,  అధికార దుర్వినియోగం రుజువైన సందర్భాల్లో మాత్రమే ఒక అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అవకాశం కల్పించారు. అయితే, ఇది కేవలం న్యాయపరమైన అంశం మాత్రమే కాదని, పూర్తిగా రాజకీయ సంఖ్యాబలం ,  చట్టసభల సమీకరణాలతో ముడిపడి ఉన్న అత్యంత సంక్లిష్టమైన ప్రజాస్వామ్య ప్రక్రియ. దీని తొలి అంకం ప్రతినిధుల సభ పరిధిలోనే ప్రారంభమవుతుంది. ట్రంప్ తీసుకునే వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు, వాణిజ్య సుంకాలు లేదా భౌగోళిక ఘర్షణలపై విపక్ష డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో అభియోగ పత్రాన్ని ప్రవేశపెట్టడం సాంకేతికంగా చాలా తేలిక.

ప్రతినిధుల సభలోని 435 మంది సభ్యులలో సాధారణ మెజారిటీ  218 ఓట్లు  వస్తే సదరు ఇంపీచ్‌మెంట్ తీర్మానం ఆమోదం పొందుతుంది. గతంలో ట్రంప్ తన మొదటి విడత పదవీకాలంలో  2019 ,  2021లలో  రెండుసార్లు ప్రతినిధుల సభ ద్వారా ఇంపీచ్‌మెంట్‌కు గురయ్యారు. ప్రస్తుత కాంగ్రెస్‌లో విపక్షాల బలం పెరిగిన దృష్ట్యా, ట్రంప్‌పై ప్రతినిధుల సభలో ఇంపీచ్‌మెంట్ నెగ్గించడం సాంకేతికంగా పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఇదొక్కటే అధ్యక్షుడిని పదవి నుంచి వీడ్కోలు పలికించడానికి ఏమాత్రం సరిపోదు.

సెనెట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలి!

అసలైన రాజ్యాంగపరమైన సంక్లిష్టత ఆ తర్వాత మొదలయ్యే  సెనేట్ విచారణలో ఎదురవుతుంది. ప్రతినిధుల సభ ఆమోదించిన అభియోగాలు విచారణ కోసం సెనేట్‌కు వెళతాయి. అక్కడే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అధ్యక్షతన విచారణ ప్రక్రియ  జరుగుతుంది. సెనేట్‌లో అధ్యక్షుడిని దోషిగా తేల్చి  , పదవి నుంచి తొలగించాలంటే రాజ్యాంగం ప్రకారం 100 మంది సెనేటర్లలో మూడింట రెండొంతుల వంతు   67 మంది సెనేటర్లు మద్దతు తప్పనిసరిగా లభించాలి. సెనేట్‌లో డెమొక్రాట్లకు మెజారిటీ లభించినప్పటికీ, 67 ఓట్ల మార్కును చేరుకోవడం  సాధ్యం కాని విషయం.  రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు సెనేటర్లు విపక్షాలకు మద్దతుగా ఓటు వేస్తే తప్ప 67 ఓట్లు సమకూరవు. అమెరికా రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఒక్క అధ్యక్షుడూ సెనేట్ ద్వారా పదవి కోల్పోలేదు  గతంలో ఆండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్, ట్రంప్  సెనేట్‌లో గట్టెక్కారు . రిపబ్లికన్ పార్టీ నేతలు తమ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఇంత పెద్ద సంఖ్యలో క్రాస్ ఓటింగ్ చేసే అవకాశాలు అత్యల్పం.

ట్రంప్ పదవికి వచ్చిన గండం లేదు!  

అందువల్ల, వైట్ హౌస్ నుంచి ట్రంప్‌ను గద్దె దించడం సులభం కాకపోయినప్పటికీ, ఈ ఇంపీచ్‌మెంట్ అస్త్రాన్ని విపక్షాలు ప్రధాన రాజకీయ ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలోని కమిటీల ద్వారా ట్రంప్ ప్రభుత్వంపై నిరంతర విచారణలు జరపడం, సబ్‌పోనాలు జారీ చేయడం, ఆయన నిర్ణయాలకు అడ్డుకట్ట వేస్తూ ‘పొలిటికల్ డిఫెన్స్’లో పడేయడం డెమొక్రాట్లకు సాధ్యమవుతుంది.  ప్రతినిధుల సభలో ఇంపీచ్‌మెంట్ ఆమోదించడం సులభమే అయినా, సెనేట్‌లో 67 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించడం దాదాపు అసాధ్యం. ఫలితంగా, ఇంపీచ్‌మెంట్ అనేది ట్రంప్‌ను పదవి నుంచి తొలగించే మార్గం కంటే, ఆయన రెండవ విడత పరిపాలనా వేగానికి కళ్లెం వేసే అడ్మినిస్ట్రేటివ్ అడ్డంకిగా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఎక్కువ.
  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chirala AP Municipal Election Results : చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Vijayasai Reddy: కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
Botsa Anusha: బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Embed widget