అన్వేషించండి

Mlc Kavitha CBI Notices : ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, దిల్లీ లిక్కర్ లెక్కలపై విచారణ!

Mlc Kavitha CBI Notices : సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. డిసెంబర్ 6న విచారణకు హాజరుకావాలని తెలిపింది.

Mlc Kavitha CBI Notices : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. దిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు చేర్చారు. తాజాగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ లో కవిత వివరణ తీసుకునేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో తెలిపింది. దిల్లీ, హైదరాబాద్ లో ఎక్కడైనా హాజరుకావొచ్చని సీబీఐ చెప్పింది. ఈ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.   

"దిల్లీ లిక్కర్ స్కామ్ లో వివరణ కోరుతూ Cr.P.C సెక్షన్ 160 ప్రకారం CBI నోటీసులు జారీచేసింది. వారి అభ్యర్థన మేరకు డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని నా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశాను" - ఎమ్మెల్సీ కవిత 


Mlc Kavitha CBI Notices : ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, దిల్లీ లిక్కర్ లెక్కలపై విచారణ!

ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు దిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని  అరోరా అంగీకరించారని తెలిపారు. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకోగా..  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని ఈడీ చెబుతోంది. ఈ మొత్తం స్కాం గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు వాడారాని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత కూడా ఫోన్లు మార్చారని.. వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది.  అమిత్ అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడు.  ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. గురుగాంకు చెందిన అమిత్ అరోరా ,దినేష్ అరోరా, అర్జున్ పాండేలతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పనిచేసినట్లు ఈడీ చెబుతోంది. వీరిలో దినేష్ అరోరా ఇప్పటికే అప్రూవర్‌గా మారారు.  అమిత్ అరోరా బడ్జీ అనే  ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు.  సీబీఐ, ఈడీ FIRలో అమిత్ అరోరా 9వ నిందితునిగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.   

ముందు నుంచే ఆరోపణలు 

ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించినప్పుడే తెలంగాణకు చెందిన కల్వకుంట్ల పేరును బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే తనపై ఆరోపణలు చేయడాన్ని కవిత ఖండించారు. ఆధారాలు లేకుండా ఆరోపిస్తున్నారని.. తనపై విమర్శలు చేయకుండా కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు. ఇటీవల సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి చార్జిషీటును దాఖలు చేసింది. అలాగే.. ఈడీ కూడా సమీర్ మహేంద్రుపై చార్జిషీటు దాఖలు చేసింది. కానీ సెల్ ఫోన్ల ధ్వంసం గురించి ప్రస్తావించారు కానీ.. కవిత పేరు మాత్రం తెరపైకి తీసుకురాలేదు. ఇటీవల ఈడీ ఈ కేసు విషయంలో కవిత పేరును ప్రస్తావించింది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులుSiddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధుMalla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Embed widget