By: ABP Desam | Updated at : 27 Sep 2023 09:15 PM (IST)
రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో సారి స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదన్నారు. చంద్రబాబు ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని, జాతీయ స్థాయిలో ప్రభావం చూపించిన వ్యక్తి అన్నారు. అటువంటి వ్యక్తి అరెస్ట్ గురించి నిరసనలు తెలిపితే అందుకు అనుమతి ఇవ్వాలి కానీ అడ్డుకుంటే ఎలా? అంటూ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మ వారి ఓట్లు బీఆర్‌ఎస్‌కు కావాలని, కానీ వారికి నిరసనలు తెలిపే హక్కు లేదా? అంటూ నిలదీశారు. చంద్రబాబు అరెస్ట్ తెలంగాణకు సంబంధం లేదనుకుంటే తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాలో వైట్ హౌజ్ ముందు ఎందుకు నిరసనలు తెలిపారు? అంటూ అడిగారు. నిరసన తెలిపే వారిని అడ్డుకుంటే వారు ఈసారి బీఆర్ఎస్ పార్టీ చెంపలు వాయిస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.
మంత్రి కేటీఆర్ ఏమని చెప్పారంటే?
చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్‌లో ఆందోళనలు జరుగుతూంటే.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంశంపై నారా లోకేష్.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేశారు. హైదరాబాద్‌లో ఆందోళనలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆరే తెలిపారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఆందోళనలపై స్పందించారు. లోకేష్ ఫోన్ చేశారని.. చంద్రబాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో ఆందోళనలు చేయడం ఏమిటని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ రెండు పార్టీలసమస్య అన్నారు. ధర్నాలు, ర్యాలీలు ఏపీలో చేసుకోవాలని.. తెలంగాణలో వద్దని స్పష్టం చేశారు.
లోకేష్ ఫోన్ చేస్తే శాంతిభద్రతలే ముఖ్యమని చెప్పానన్న కేటీఆర్
ధర్నాలకు, ర్యాలీలకు అనుమతి ఇవ్వాలని లోకేష్ చేసినప్పుడే.. శాంతిభద్రతలు తమకు ముఖ్యమని చెప్పామన్నారు. ఎలాంటి ర్యాలీలు అయినా.. ఏపలో చేసుకోవాలన్నారు. జగన్ , పవన్ , లోకేష్ అందరూ తనకు స్నేహితులేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాటల్ని బట్టి.. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల నిరసనల్ని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని భావిస్తున్నారు. అయితే తెలంగాణలోని పలు చోట్ల చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల.. నల్లగొండ జిల్లా కోదాడతో పాటు హైదరాబాద్ నిజామాబాద్ వంటి చోట్ల కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఎవరూ పెద్దగా అడ్డుకోవడం లేదు.
గతంలో ఎలా చూడట్లేదని చెప్పిన రేవంత్ రెడ్డి
చంద్రబాబు అరెస్ట్‌పై గతంలో రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఒక రిపోర్టర్ చంద్రబాబు అరెస్ట్ గురించి రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించాడు. బాబు అరెస్ట్‌ను ఎలా చూస్తారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రేవంత్ స్పందించేందుకు ఆసక్తి చూపలేదు. ఎట్ల చూస్తలేమని, ఎట్ల జరుగుతుందో అట్లనే చూస్తున్నామంటూ తెలిపారు. అరెస్ట్ చేసినట్లే చూస్తున్నామని సమాధానమిచ్చారు. బాబు అరెస్ట్ గురించి స్పందించేందుకు రేవంత్ ఆసక్తి చూపలేదు. దీంతో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మిగ్‌జాం తుపాను- అధికార యంత్రాంగం అప్రమత్తం
అన్ని తుపానులకు ఎందుకు పేర్లు పెట్టరూ? మిగ్‌జాం అంటే అర్థమేంటీ?
Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం
Gold-Silver Prices Today 05 December 2023: కనుచూపు మేరలో కనిపించని పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Telangana Letter to KRMB: 'సాగర్ ప్రాజెక్టు వద్ద పూర్వ పరిస్థితిని పునరుద్ధరించండి' - కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
/body>