Top Headlines Today: డిప్యూటీ సీఎంకు దొరకని టిక్కెట్ గ్యారంటీ!- గోషామహల్ సీటు కోసం ఒవైసీని కలుస్తున్న బీఆర్ఎస్ నేతలు!
Top 5 Telugu Headlines Today 29 August 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top 5 Telugu Headlines Today 29 August 2023:
గోషామహల్ సీటు కోసం ఓవైసీ చుట్టూ బీఆర్ఎస్ ఆశావహుల చక్కర్లు
గోషామహల్ బీఆర్ఎస్ టిక్కెట్ ను ఖరారు చేసేది మజ్లిస్ చీఫ్ ఓవైసీనేనని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. అందుకే టిక్కెట్ ఎవరికి ఇస్తారో ఖరారు చేయలేదంటున్నారు. దానికి తగ్గట్లుగానే గోషామహల్ బీఆర్ఎస్ ఆశావహులు మజ్లిస్ చీఫ్ ఆశీస్సుల కోసం తిరుగుతున్నారు. గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున ఎక్కువగా పర్యటిస్తోంది గడ్డం శ్రీనివాస్ యాదవ్ అనే నేత. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫీసులో కంటే ఎక్కువగా మజ్లిస్ ఆఫీసులోనే కనిపిస్తున్నారు. తన పేరును సిఫారసు చేయాల్సిందిగా ఆయన మజ్లిస్ చీఫ్ ను కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మజ్లిస్ చీఫ్ తో మంతనాలు జరుపుతున్న గడ్డం శ్రీనివాస్ ఫోటోలను ABP దేశం ఎక్స్ క్లూజివ్‌గా సేకరించింది. పూర్తి వివరాలు
డిప్యూటీ సీఎంకు దొరకని టిక్కెట్ గ్యారంటీ - రాజన్న దొరకు దారేది ?
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వారిలో ఒకరు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేతల్లో ఆయన ఒకరు. నాలుగు సార్లు గెలిచారు. కానీ ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ భరోసా లేకుండా పోయింది. ఆయన నియోజకవర్గంలోనే గిరిజన వర్శిటీకి శంకుస్థారన చేసిన సీఎం జగన్... మరోసారి రాజన్నదొరను ఆదరించాలని అక్కడి ప్రజలకు పిలుపునివ్వలేదు. దీంతో వైసీపీలో చర్చ ప్రారంభమయింది. పూర్తి వివరాలు
సాయంత్రం టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ, దరఖాస్తులపై నేతల చర్చ
తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సాయంత్రం(మంగళవారం) సమావేశం కానుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది. ఇప్పటికే ఆశావహుల నుంచి అర్జీలు స్వీకరించిన పీసీసీ.. వాటి పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 1025 దరఖాస్తులు వచ్చాయ్. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు వచ్చిన 1025 దరఖాస్తులపై ఎలక్షన్ కమిటీలో చర్చించనుంది. సాయంత్రం నాలుగు గంటలకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. దరఖాస్తులు ఆహ్వానించిన తర్వాత మొదటిసారి సమావేశం అవుతోంది. పూర్తి వివరాలు
ఆ విషయంలో లక్ష్మీపార్వతి ఒంటరి అయ్యారా! పార్టీ నుంచి సపోర్ట్ రాలేదా!
ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా ఉండిపోయింది. అదే పార్టీలో ఉన్న నందమూరి లక్ష్మి పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. నందమూరి తారక రామారావు శత జయంతి పురస్కరించుకొని ఆర్బీఐ వంద రూపాయల నాణెం ముద్రించింది. ఈ నాణాన్ని రాష్ట్రపతి స్వయంగా ఆవిష్కరించారు. నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్న ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హజరు అయ్యారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎక్కడా కామెంట్స్ చేయటం లేదు. పూర్తి వివరాలు
ఇసుక క్వారీల వద్ద టీడీపీ ధర్నాలు- రేపు మైనింగ్ శాఖ ఆఫీస్ ముట్టడికి పిలుపు
ఇసుక అక్రమ తవ్వకాలపై తెలుగు దేశం పార్టీ తలపెట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు జరిగిన ఆందోళనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై మూడు రోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చింది పార్టీ అధినాయకత్వం. మొదటి రెండు రోజులు ఇసుక అక్రమ రీచ్‌ల వద్ద నిరసనలు తలపెట్టి తెలుగుదేశం పార్టీ 30వ తేదీన మైనింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ శ్రేణులు రెండు రోజుల నుంచి ఇసుక క్వారీల వద్ద నిరసన తెలిపుతున్నాయి. పూర్తి వివరాలు





















