Top 5 Headlines Today: ఏపీలో టీడీపీ కొత్త ఉద్యమానికి శ్రీకారం! భారీ కాన్వాయ్‌తో సోలాపూర్ కు కేసీఆర్!
Top 5 Telugu Headlines Today 26 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
సిల్లీ బచ్చాను కాదు, సెల్ఫే మేడ్ మ్యాన్‌ను - దమ్ముంటే నాపై పోటీ చెయ్- లోకేష్‌పై అనిల్ ఘాటు రియాక్షన్
సిల్లీ బచ్చా అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు అంతే ఘాటుగా బదులిచ్చారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. తాను సిల్లీ బచ్చాని అయితే తనని చూసి లోకేష్ ఎందుకంత భయపడుతున్నారని సెటైర్లు పేల్చారు. తాను సిల్లీ బచ్చాను కాదని, సెల్ఫే మేడ్ మ్యాన్ ని అని, తన తండ్రి, తాత ముఖ్యమంత్రులు కాదన్నారు. తండ్రి, తాత ముఖ్యమంత్రులు కావడం వల్లే లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయ్యారని వెటకారం చేశారు. ఆంధ్ర రాష్ట్ర పులికేసి, ఆంధ్ర రాష్ట్ర ముద్దు పుప్పు నారా లోకేష్ అని సెటైర్లు పేల్చారు అనిల్ కుమార్ యాదవ్. లోకేష్ గ్రామసింహంలా సింహపురిలో అడుగు పెట్టారని అన్నారు. పూర్తి వివరాలు
భారీ కాన్వాయ్‌తో సోలాపూర్ బయల్దేరిన కేసీఆర్- రేపు బహిరంగ సభ
భారీ కాన్వాయ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని సోలాపూర్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయన రెండు రోజులు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. బస్సులో భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గంలో ప్రగతి భవనం నుంచి పయనమయ్యారు. దాదాపు 600 వాహనాలు ఆయనతో కదిలారు. కేసీఆర్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు వెళ్లారు. సోలాపూర్ వెళ్లే మార్గంలో మధ్యాహ్నం ఒంటిగంటకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. ధారాశివ్ జిల్లా ఒమర్గా వద్ద లంచ్ చేసి అక్కడ కాసేపు రెస్టు తీసుకుంటారు. పూర్తి వివరాలు
'ఇది రాష్ట్రమా....? రావణ కాష్ఠమా..?' - ఏపీలో శాంతిభద్రతల తీరుపై టీడీపీ కొత్త ప్రచారఉద్యమం !
'నాలుగేళ్ల నరకం' అనే పేరుతో టీడీపీ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో గల్లీ నుండి పట్టణాల వరకు ప్రజలకి జరిగిన అన్యాయాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విదంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ "నాలుగేళ్ల నరకం" కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పూర్తి వివరాలు
ముద్రగడ, ద్వారంపూడి సవాళ్లపై ఇచ్చి పడేసిన పవన్ కల్యాణ్- వైసీపీపై వార్ ప్రకటించిన జనసేనాని !
కాకినాడలో తనపై పోటీ చేసి గెలవాలని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేశారు. అదే లైన్‌లో కాకినాడలో ద్వారంపూడిపై పోటీ చేస్తారో... తనపై పిఠాపురంలో పోటీ చేస్తారో తెల్చుకోవాలని ముద్రగ పద్మనాభం ఛాలెంజ్ విసిరారు. దీనిపై సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు కూడా విమర్శలు చేశారు. అన్నింటినికీ ఒక సమాధానంతో తేల్చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మలికిపురం బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎదుగుదలను ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూనే వైసీపీ గెలవకుండా చేస్తామంటూ శపథం చేశారు. పూర్తి వివరాలు