భారీ కాన్వాయ్‌తో సోలాపూర్ బయల్దేరిన కేసీఆర్- రేపు బహిరంగ సభ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర వెళ్లారు. ప్రగతి భవన్‌లో బయల్దేరిన ఆయనతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
భారీ కాన్వాయ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని సోలాపూర్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయన రెండు రోజులు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. బస్సులో భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గంలో ప్రగతి భవనం నుంచి పయనమయ్యారు. దాదాపు 600 వాహనాలు ఆయనతో కదిలారు. కేసీఆర్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు వెళ్లారు.
సోలాపూర్ వెళ్లే మార్గంలో మధ్యాహ్నం ఒంటిగంటకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. ధారాశివ్ జిల్లా ఒమర్గా వద్ద లంచ్ చేసి అక్కడ కాసేపు రెస్టు తీసుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకు మళ్లీ బయల్దేరి రాత్రికి సోలాపూర్ చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం పండరీపురం చేరుకుంటారు.
Telangana CM #KCR start his two-day #Maharashtra visits. He is travelling to Dharashiva from #Hyderabad by road and is expected to reach Solapur in the evening. The 600-vehicle convoy will include #BRS ministers, MLAs, MLCs, and other leaders. On Tuesday Pink Party chief will… pic.twitter.com/xDHyoZQwrM
— Ashish (@KP_Aashish) June 26, 2023
పండరీపురంలో విఠోభారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు సీఎం కేసీఆర్. ఆయనతోపాటు మంత్రులు, ఇతర బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కూడా పూజల్లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత సోలాపూర్‌లోని సర్కోలి గ్రామానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
ఈ సభ సాక్షిగా భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. అక్కడ సభ ముగిసిన వెంటనే తిరుగు పయనమవుతారు. ఈ క్రమలోనే ధారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
BRS President, CM Sri KCR left for Solapur in Maharashtra by road from Hyderabad today. pic.twitter.com/LpFZ2k5m3c
— BRS Party (@BRSparty) June 26, 2023