అన్వేషించండి

Top Headlines Today: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం- ఈ 27న కాంగ్రెస్‌లో చేరనున్న మైనంపల్లి!

Top 5 Telugu Headlines Today 25 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top 5 Telugu Headlines Today 25 September 2023: 
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం
స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో మెన్షన్ అయింది. ఈ ఉదయం చంద్రబాబు తరపున అడ్వకేట్ సిద్దార్థ లుథ్రా దీని ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. ఎన్ని రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారని ప్రశ్నించారు సీజేఐ. వివరాలు చెప్పిన తర్వాత రేపు మరోసారి మెన్షన్ చేయాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. ఇదే కేసులో వివిధ కోర్టుల్లో కూడా పిటిషన్లు వేసినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వరుస పిటిషన్లు వేస్తున్నారు. సుప్రీంకోర్టులో లూథ్రా, ఏసీబీ కోర్టులో ప్రమోద్‌ దూబే వాదిస్తున్నారు. పూర్తి వివరాలు

పిల్లికి భిక్షం పెట్టని వాళ్లు ప్రజలకేం చేస్తారు, సోదరులపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా రావాల్సిన ఆస్తి పంపకాల్లో సోదరులే తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ములు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా, ఇంటి నుంచి గెంటేశారని వాపోయారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోనిమర్రిపాడులో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. అన్నదమ్ములు ముగ్గురు ఒకసారి ఆస్తుల గురించి మాట్లాడుకున్నామని... ఎవరికి ఎంతెంత వాటా వస్తుందో చర్చించుకున్నామని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి ఎంత మోసగాడో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. పూర్తి వివరాలు

డిసెంబర్‌ 7న తెలంగాణ ఎన్నికలు-11న ఫలితాలు-తాత్కాలిక షెడ్యూల్‌ రూపకల్పన
తెలంగాణలో ఎన్నికల శంఖారావం మోగనుంది. జమిలీ ఎన్నికల పేరుతో ఇప్పటి వరకు కాస్త సందిగ్ధత కనిపించింది. లెక్క ప్రకారం డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయా...  లేక... ఒకే దేశం-ఒకే ఎన్నిక ఫార్ములా అమల్లోకి తెచ్చి 2024లో లోక్‌సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు పెడతారా? అన్న అంశంపై సస్పెన్స్‌ కొనసాగింది. కానీ... ఆ  అనుమానాలన్నీ ఇప్పుడు తీరిపోయాయి. తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు.. ఎలక్షన్‌ కమిషన్‌ కసరత్తు చేస్తోంది. ఎన్నికల తేదీలకు సంబంధించి  తాత్కాలిక షెడ్యూల్‌ కూడా సిద్ధం చేసింది. ఆ షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే డిసెంబర్‌ 11న కౌంటింగ్‌ నిర్వహించి... ఎన్నికల  ఫలితాలు ప్రకటిస్తారు. పూర్తి వివరాలు

సోనియా సమక్షంలో ఈనెల 27న కాంగ్రెస్‌లో చేరుతా : మైనంపల్లి హనుమంతరావు
ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంప్లలి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. అయితే ఈనెల 27వ తేదీన సోనియా గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతారని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. కాంగ్రెస్ రెండు అసెంబ్లీ సీట్ల విషయం సర్వే రిపోర్ట్ ఆధారంగా ఇవ్వమని అడిగినట్లు పేర్కొన్నారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా మల్కాజిగిరి, మెదక్ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసారని మీడియాకు వివరించారు. తన సన్నిహితుడు నక్కా ప్రభాకర్ గౌడ్ కు మేడ్చల్ అసెంబ్లీ సీట్ గురించి రిక్వెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. మైనంపల్లిని పార్టీలోకి ఆహ్వానించేందుకు సోమవారం రోజు కాంగ్రెస్ నేతలు ఆయన నివాసానికి క్యూ కట్టారు. పూర్తి వివరాలు

దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చెయ్ - రాహుల్‌గాంధీకి ఓవైసీ సవాల్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని చాలెంజ్ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారని ఆరోపించారు. ‘మీ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసురుతున్నాను. మీరు పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో నాతో తలపడండి’ అని అన్నారు. 
పూర్తి వివరాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Chitram Choodara Movie Review - చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
Weather Latest Update: నేడు ఓ మోస్తరు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ - కొనసాగనున్న కూల్ వెదర్: ఐఎండీ
నేడు ఓ మోస్తరు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ - కొనసాగనున్న కూల్ వెదర్: ఐఎండీ
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Chitram Choodara Movie Review - చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
Weather Latest Update: నేడు ఓ మోస్తరు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ - కొనసాగనున్న కూల్ వెదర్: ఐఎండీ
నేడు ఓ మోస్తరు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ - కొనసాగనున్న కూల్ వెదర్: ఐఎండీ
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
Sovereign Gold Bond: 8 ఏళ్లలో మీ డబ్బులు ట్రిపుల్‌- సావరీప్ గోల్డ్ బాండ్‌తో లైఫ్‌ బంగారమే!
8 ఏళ్లలో మీ డబ్బులు ట్రిపుల్‌- సావరీప్ గోల్డ్ బాండ్‌తో లైఫ్‌ బంగారమే!
Monkey Fever: చిన్నారి ప్రాణం తీసిన ‘మంకీపాక్స్’ - నివారణ చర్యలివే, ఈ లక్షణాలు కనిపిస్తే జరభద్రం!
చిన్నారి ప్రాణం తీసిన ‘మంకీపాక్స్’ - నివారణ చర్యలివే, ఈ లక్షణాలు కనిపిస్తే జరభద్రం!
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Embed widget