చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మెన్షన్ అయింది. ఈ ఉదయం చంద్రబాబు తరపున అడ్వకేట్ సిద్దార్థ లుథ్రా దీని ప్రస్తావన తీసుకొచ్చారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మెన్షన్ అయింది. ఈ ఉదయం చంద్రబాబు తరపున అడ్వకేట్ సిద్దార్థ లుథ్రా దీని ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. ఎన్ని రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారని ప్రశ్నించారు సీజేఐ. వివరాలు చెప్పిన తర్వాత రేపు మరోసారి మెన్షన్ చేయాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు.
ఇదే కేసులో వివిధ కోర్టుల్లో కూడా పిటిషన్లు వేసినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వరుస పిటిషన్లు వేస్తున్నారు. సుప్రీంకోర్టులో లూథ్రా, ఏసీబీ కోర్టులో ప్రమోద్ దూబే వాదిస్తున్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ఉన్నాయి ఈ లోపే తేల్చుకోవాలని టీడీపీ తరఫున లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 28న మిలాదున్ నబీ, సెప్టెంబర్ 29న ఢిల్లీ లోకల్ హాలిడే ఉంది. సెప్టెంబర్ 30న శని వారం, అక్టోబర్ 1న ఆదివారం వచ్చింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు ఉంది.
మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు తరుపు వాదిస్తున్న లాయర్ల స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. 284 పేజీలతో కూడిన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం, అజాయకల్లాంను చేర్చారు.