By: ABP Desam | Updated at : 24 May 2023 03:07 PM (IST)
ఏపీ, తెలంగాణ టాప్ హెడ్ లైన్స్
వారసుల ఎంట్రీకి వైసీపీ అధినేత ఓకే చెప్పారా?- అందుకే పేర్ని నాని రిటైర్మెంట్ ప్రకటించారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వారసులు రెడీ అవుతున్నారు. ఇందులో మొదటి వరుసలో నిలిచారు మచిలీపట్టణం శాసనసభ్యుడు పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేర్ని నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి దఫాలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత నుంచి పేర్ని నాని పేరు మారుమోగిపోయింది. ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో ఆయనతో ప్రత్యేక స్టైల్. ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేసే ఆరోపణలకు వైసీపీ నుంచి మొదట కౌంటర్ ఇచ్చేది ఈయన. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
విద్యలో దేశానికి ఆంధ్రప్రదేశ్ దిశానిర్దేశం చేయబోతుంది: సీఎం జగన్
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యాదీవెన పథకానికి సంబంధించి నిధులను విడుదల చేశారు. 2023 మొదటి త్రైమాసికానికి సంబంధించిన 703 కోట్ల రూపాయల నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. రాబోయే రోజుల్లో దేశానికి ఆంధ్రప్రదేశ్ దశదిశ చూపించబోతుందన్నారు సీఎం జగన్. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయని అభిప్రాయపడ్డారు. వివక్ష పోవాలన్నా పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రమని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నన్ను ఎలా వాడుకోవాలనేది బీజేపీ హైకమాండ్ ఇష్టం - ఈటల కీలక వ్యాఖ్యలు !
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఇస్తారని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నందున రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉందంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తదేన్నారు. తనను ఎలా ఉపయోగించుకోవాలో అన్నది బీజేపీ హైకమాండ్ ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఈటల రాజేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జాతీయ అంశాలపై నోరు మెదపని నయా దేశ్ కీ నేత కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చేసి జాతీయ రాజకీయాలు ప్రారంభించిన కేసీఆర్.. జాతీయ అంశాలపై మాత్రం పూర్తి సైలెంట్ గా ఉంటున్నారు. విపక్ష కూటముల సమావేశాల్లో పాలు పంచుకోవడం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు కూడా ప్రకటించలేదు. గత మూడు, నాలుగు రోజులుగా చాలా అంశాలపై బీజేపీపై పోరాడుతున్న నేతలంతా ప్రకటనలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం నోరు తెరవడం లేదు. చివరికి ఆప్తమిత్రుడు కేజ్రీవాల్‌కు సమస్య వచ్చినా మద్దతుగా ఒక్క ప్రకటన చేయలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆయనొస్తున్నారని ఊరంతా ఖాళి - పూతలపట్టు ఎమ్మెల్యేకు అవమానం !
గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్తున్న సమయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగేళ్లుగా సమస్యలు పరిష్కరించకపోగా..ఎవరైనా గ్రామం నుంచి వెళ్తే కనీసం పట్టించకోలేదని ఇప్పుడు ఓట్ల కోసం వస్తారా అని చాలా గ్రామాల్లో నేతలు .. ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు గ్రామాల్లో ఇళ్లకు తాళాలేసి వెళ్లిపోతున్నారు. తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్ భారీ బోనస్ ప్రకటన - ఈసారి ఏకంగా రూ.700 కోట్లు
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
KCR Speech: ధరణి వద్దన్నోడిని గిరాగిరా తిప్పి బంగాళాఖాతంలో విసిరెయ్యండి - కేసీఆర్ వ్యాఖ్యలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్
Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి
WTC Final 2023: ప్చ్.. టీమ్‌ఇండియా 296 ఆలౌట్! అజింక్య సెంచరీ మిస్ - ఆసీస్‌కు భారీ లీడ్!