By: ABP Desam | Updated at : 24 May 2023 01:26 PM (IST)
ఆయనొస్తున్నారని ఊరంతా ఖాళి - పూతలపట్టు ఎమ్మెల్యేకు అవమానం !
Chittor News : గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్తున్న సమయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగేళ్లుగా సమస్యలు పరిష్కరించకపోగా..ఎవరైనా గ్రామం నుంచి వెళ్తే కనీసం పట్టించకోలేదని ఇప్పుడు ఓట్ల కోసం వస్తారా అని చాలా గ్రామాల్లో నేతలు .. ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు గ్రామాల్లో ఇళ్లకు తాళాలేసి వెళ్లిపోతున్నారు. తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్క సారి కూడా పేట అగ్రహారం వెళ్లని ఎంఎస్ బాబు
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం శాసన సభ్యడు ఎంఎస్ బాబుకుకు చేదు పూతలపట్టు మండలం పేట అగ్రహారంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్లాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. విషయం తెలిసిన గ్రామస్తులు ఇళ్లకు తాళాలేసి వెళ్లిపోయారు. అధికారులు, వాలంటీర్లు, మందీ మార్బాలంతో వెళ్లిన ఎమ్మెల్యేకు గ్రామంలో జనం కనిపించకపోవడంతో షాక్ కు గురయ్యారు. దీంతో బయటకు వెళ్లలేని ముసలి వాళ్లకు నవరత్నాల పాంప్లెట్లు ఇచ్చి. ..వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనకే ఓటేయాలని కోరారు.
పలు గ్రామాల్లో ఎంఎస్‌బాబుకు ఇదే తరహా వ్యతిరేకత
ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇదే మొదటి సారి కాదు. గత వారం క్రితం పూతలపట్టు మండలంలో నిర్వహించిన గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంకు అమ్మగారిపల్లెలోని ప్రజలు ఎమ్మెల్యేను తమ గ్రామంలోకి రావొద్దని అడ్డుకోవడంతో పాటుగా ఎమ్మెల్యేను నిలదీశారు.. గత నాలుగేళ్ళుగా ఎన్నడూ తన గ్రామంను పట్టించుకోకుండా ఎన్నికల తరుణంలో తమ గ్రామానికి రావడంపై మండిపడ్డారు.. తమ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు సైతం చేపట్టలేదని, కనీసం తమ గ్రామ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వచ్చినా పట్టించుకోని ఎమ్మెల్యే, తమ గ్రామాల్లో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంకు హాజరు కావడం విడ్డూరంగా ఉందన్నారు..
ఎమ్మెల్యే పని తీరు బాగోలేదని జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్.బాబుపై ప్రజలు ఇలా వరుసగా ఆగ్రహం వ్యక్తం చేస్తూండటంత ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది.. తరచూ ఎంఎస్.బాబును ప్రజలు అడ్డుకోవడంపై జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటుగా,నాయకుకు, కార్యకర్తలు ఆయనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పుకుంటున్నారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పై సిరియస్ అయినట్లు తెలుస్తోంది.. ఎంఎస్.బాబును పిలిపించి మరి అగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్ని పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు.
Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే
Kodela Shivaram: మరో వివాదంలో కోడెల శివరాం, బాధితుల తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలు!
Amaravati JAC: ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నాం, ఇది చారిత్రక విజయం - అమరావతి జేఏసీ
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!