Top Headlines Today: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు- 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం!
Top 5 Telugu Headlines Today 24 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 24 September 2023:
11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (సెప్టెంబర్ 24) 9 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. 11 రాష్ట్రాల్లో వందేభారత్ ట్రైన్స్‌ను వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారు. ఈ వందే భారత్ రైళ్ల ద్వారా, ఈ అన్ని రాష్ట్రాల్లో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్ మరియు గుజరాత్ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహా, ఈ 11 రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. పూర్తి వివరాలు
వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
టీడపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తదనంతర పరిణానాలపై నారా లోకేష్ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈక్రమంలోనే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలు, పార్టీల నేతలకు నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని టీడీపీ నేతలు అభిప్రాయ పడ్డారు. ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని ఖండించారు. అలాగే ఈ టెలీకాన్ఫరెన్స్ లో లోకేష్ యువగళం పున: ప్రారంభంపై కూడా చర్చించారు. వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు. పూర్తి వివరాలు
పులకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్? నారా లోకేశ్‌పై మంత్రి రోజా సెటైర్లు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఏపీ పర్యాటక శాఖా మంత్రి రోజా తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన నిందితుడు అని అందుకే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చంద్రబాబుకు రెండు రోజులు సీఐడీ కస్టడీ అనుమతి, మరోవైపు లోకేశ్ ఢిల్లీ పర్యటనపై ఏపీ మంత్రి రోజా సెటైర్లు విసిరారు. దేశంలోనే అవినీతి అనకొండ చంద్రబాబు అని, ఆయనకు తొలి కస్టడీ డే శుభాకాంక్షలు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. పూర్తి వివరాలు
జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర బీఆర్ఎస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించి దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష కొనసాగిస్తానని అంటున్నారు మోత్కుపల్లి. అయితే పోలీసులు మాత్రం గంటల వరకే అనుమతి ఉందని తేల్చిచెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనే అవకాశం కనపిస్తోంది. పూర్తి వివరాలు
ఒకే రోజు ఏపీలో ఇద్దరు కేంద్ర మంత్రుల పర్యటన! అందుకోసమేనా?
ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు ఇద్దు కేంద్ర మహిళా మంత్రులు పర్యటించనున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఆదివారం ఏపీలో పర్యటించనున్నారు. స్మృతి ఇరానీ విశాఖలో పర్యటించనుండగా, భారతి ప్రవీణ్ పవార్ విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దేవి ఘన స్వాగతం పలికారు. ఇరువురు మంత్రులు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పూర్తి వివరాలు