Top Headlines Today: డిసెంబరులోపు విశాఖకు సీఎం జగన్ - బీఆర్‌ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్!
Top 5 Telugu Headlines Today 16 October 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 16 October 2023:
బీఆర్‌ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్- 119 చోట్ల బీజేపీ డిపాజిట్లు గల్లంతు- కవిత ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణను ప్రగతిపథంలో దూసుకెళ్లేలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఏఎన్‌ఐతో ప్రత్యేకంగా మాట్లాడిన కవిత... ఈ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజలు ఆమోదం తెలుపుతారని అభిప్రాయపడ్డారు. సంపద సృష్టిస్తూ దాన్ని ప్రజలకు పంచడంలో దేశానికే తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు కవిత. 2014తో పోల్చుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3 లక్షల 15 వేలకు చేరిందన్నారు. పూర్తి వివరాలు
డిసెంబరులోపు విశాఖ వచ్చేస్తున్నా - సీఎం వైఎస్ జగన్
త్వరలో విశాఖ నుంచే పాలన సాగించనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. డిసెంబరులోపు విశాఖకు మారనున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధి చెందుతున్న ఆయన, రాష్ట్రంలోనే విశాఖ పెద్ద నగరం అని అన్నారు. పరిపాలనా విభాగం అంతా విశాఖకు మారనున్నట్లు వెల్లడించారు. విశాఖ రిషికొండలోని ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. ఈ క్రమంలో 4,160 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు తెలిపారు. తొలుత వెయ్యి మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు
ఐఆర్ఆర్, అసైన్డ్ భూముల కేసుల వాయిదా - హైకోర్టులో చంద్రబాబుపై కేసుల విచారణలు !
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు మార్చారంటూ నమోదు చేసిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరికొంత ఊరట లభించింది. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 18కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ ముందస్తు బెయిల్ పొడిగించారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై కూడా అప్పటి వరకూ విచారించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. పూర్తి వివరాలు
కాంగ్రెస్ తొలి జాబితాలో రెడ్లకు అగ్రపీఠం, బీసీలకు 12 సీట్లు- మిగతా జాబితాల్లో ఎలా ఉండబోతోందో!
కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయనున్నారు. మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి. సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్ కేటాయించారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేరు కూడా జాబితాలో లేదు. వీరందరి పేర్లు బుదవారం లేదా గురువారం గురువారం విడుదల చేసే రెండో జాబితాలో ప్రకటించే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలు
'దసరా'కు ఊరెళ్తున్నారా.? - గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ
దసరా పండుగ వచ్చేస్తోంది. పిల్లలకు సెలవులిచ్చేశారు. సరదాగా ఊరెళ్దామనుకుంటే రైళ్లు, బస్సులన్నింటిలోనూ రద్దీ నెలకొంది. ఇప్పుడు ఎలా.? అనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 620 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలు