అన్వేషించండి

TS News Developments Today: హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లో అమెరికన్ వీసా అప్లికేషన్ సెంటర్ ప్రారంభం నేడు

అమెరికా వెళ్లాలనుకునే వారి వేలిముద్ర సేకరణ, వీసా దరఖాస్తు పత్రాలు సమర్పణ, ఇంటర్వ్యూ సేవలు అందించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ కేంద్రాన్ని అమెరికా కాన్సులేట్ అధికారులు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో అమెరికా వీసా దరఖాస్తు కేంద్రం నేడు ప్రారంభం. 

అమెరికా వెళ్లాలనుకునేవారి వేలిముద్రల సేకరణ, వీసా దరఖాస్తు పత్రాల సమర్పణ, ఇంటర్వ్యూ వంటి సేవలు ఈ కేంద్రం నుంచి అందించనున్నట్లు మెట్రో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీసా అప్లికేషన్ సెంటర్ గా పిలిచే ఈ కేంద్రంలో అమెరికా వెళ్లాలనుకునే వారి వేలిముద్ర సేకరణ, వీసా దరఖాస్తు పత్రాలు సమర్పణ, ఇంటర్వ్యూ సేవలు అందించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ కేంద్రాన్ని అమెరికా కాన్సులేట్ అధికారులు ఏర్పాటు చేశారు

నేడు మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్ వైజర్ పోస్టులకు రాత పరీక్ష. 

ఇవాళ మహిళా శిశు సంక్షేమ శాఖలో 181 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్ వైజర్) గ్రేడ్ -1 ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించునున్నట్లు TSPC సెక్రటరీ అనిత రామచంద్రన్ తెలిపారు. పేపర్-1 పరీక్షసమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. పేపర్ - 2 మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుంచి  సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఆమె తెలిపారు.

యాదాద్రిలో నేటి నుంచి నిత్య కళ్యాణాలు ప్రారంభం. 

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం, శ్రీ సుదర్శన నరసింహ హోమ పర్వాల నిర్వహణ ఆదివారం పునః ప్రారంభం కానుంది. ఆరు రోజులుగా కొనసాగిన ఆలయ వార్షిక అధ్యయన ఉత్సవాల సందర్భంగా వాటి నిలిపివేశారు.

అడ్డ గూడూరులో నేడు మంత్రుల పర్యటన

అడ్డగూడూరు మండలం చౌళ్లరామారంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.11.25 కోట్ల వ్యయంతో 15 వేల మెట్రిక్‌టన్నుల సామర్ధ్యం కల్గిన గోదాములను నిర్మించారు. మండలంలోని కంచనపల్లి గ్రామంలో తిరుమలగిరి వ్యాపారి ఇమ్మడి సోమనర్సయ్య ఆర్‌బీవో ప్లాంట్‌ నిర్మించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజనరెడ్డి, రాష్ట్ర విద్యుత శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌, రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన కంచర్ల రామకృష్ణారెడ్డి నేడు అడ్డగూడూరు మండలంలో పర్యటించి, ఉదయం 10.30 గంటలకు ఇమ్మడి సోమనర్సయ్య ఆర్‌బీవో ప్లాంట్‌ను, 11 గంటలకు ప్రభుత్వ గోదాములను ప్రారంభింస్తారని బీఆర్‌ఎస్‌ అడ్డగూడూరు మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన పొన్నాల వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం చౌళ్లరామారం గ్రామంలో నిర్వహించనున్న మోత్కూరు, అడ్డగూడూరు మండలాల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

నేటి నుంచి టోల్ ప్లాజ్ ల వద్ద దూసుకెళ్లనున్న ఆర్టీసీ బస్సులు. 

టీఎస్‌ ఆర్టీసీ బస్సులకు టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లెన్.. ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు.  సంక్రాంతి పండుగకు సొంతూళ్ల్లకు వెళ్లే ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. టోల్‌ ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రధాన మార్గాల్లోని టోల్‌ ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లెన్ కేటాయించాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఏఐ, తెలంగాణ ఆర్‌ అండ్‌ బి విభాగాలక లేఖ రాసింది. ఇదే అంశంపై టోల్‌ ప్లాజా నిర్వాహకులను కూడా సంప్రదించింది. ఇందుకు అంగీకరించిన ఆయా విభాగాలు ఈనెల 10 నుంచి 14 తేదీ వరకు టీఎస్‌ ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లెన్ కేటాయించనున్నట్లు హామీ ఇచ్చాయి.

ఈ నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని పంతంగి, కోర్లపహాడ్‌, హైదరాబాద్‌-వరంగల్‌ మార్గంలోని గూడూరు, హైదరాబాద్‌-సిద్దిపేట మార్గంలోని దుద్దెడ, హైదరాబాద్‌-నిజామాబాద్‌ మార్గంలోని మనోహరాబాద్‌, హైదరాబాద్‌-కర్నూలు మార్గంలోని రాయికల్‌ టోల్‌ ప్లాజాల వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిఫ్ట్‌లలో 24 గంటల పాటు విధులు నిర్వర్తించనున్నారు. కాగా, సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌, ఎంజీబీఎస్‌లో కంట్రోల్‌ కమాండ్‌ సెంటర్లను టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రద్దీ సమయాల్లో టోల్‌ ప్లాజాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షించడంతో పాటు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకుంటారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget