News
News
X

TS News Developments Today: తెలంగాణలో టాప్‌ న్యూస్ డెవలప్‌మెంట్‌ న్యూస్‌ ఇదే!

జిహెచ్ ఎంసీ , హెచ్ఎండిఏ తెలంగాణ ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ సమిష్టి సహారంతో ఓ మహా అద్భుతానికి తుది మెరుగులు దిద్దింది. చరిత్రలో కనుమరుగైన బన్సీలాల్ పేట మెట్లబావికి తిరిగి పూర్వ వైభవం రానుంది.

FOLLOW US: 
Share:

TS News Developments Today: నేడు చారిత్రక మెట్లబావిని ప్రారంభించనున్న మంత్రి కేటిఆర్. 

హైదరాబాద్‌లో చార్మినార్ ను వంటి అరుదైన నిర్మాణాలకు ధీటుగా బన్సీలాల్ పేట మెట్లబావి పర్యాటకేంద్రం కానుంది. 300 వందల సంవత్సరాల క్రితం నాటి బన్సిలాల్ పేట మెట్లబావిని పునరుద్దరించారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం, GHMC, HMDA సంయుక్తంగా దీన్ని పునరుద్దరణ కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 8నెలలు అధికారులు, సిబ్బంది శ్రమించి ఈ బావకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ బావి కొత్త అందాలతో ముస్తాబైంది. ఈ బావిని నాగన్న కుంటబావి అని కూడా అంటారు. ఒకప్పుడు దీన్ని నీటి వినియోగం కూడా వాడేవారు. ఈ బావి 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో 3శతాబ్దాల క్రితం దీన్ని నిర్మించారు. ఈ మెట్ల బావిని మున్సిపల్ శాఖామంత్రి కేటిఆర్ ప్రారంభించానున్నారు. గతంలో ఒకసారి మన్ కీ బాత్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా ప్రస్తావించారు. సికింద్రాబాద్, బన్సీలాల్  పేటలోని 17వ శతాబ్ద కాలంనాటి మెట్లబావి చారిత్రాత్మక కట్టడాల్లో ఓ వినూత్న నిర్మాణం. ఏకంగా 22లక్షల త్రాగునిటిని తనలో నింపుకున్న అరుదైన కట్టడం.. అంతటి ప్రసిద్ది చెందిన బన్సీలాల్ పేట మెట్ల బావి, దాదాపు నలభై ఏళ్లపాటు పాలకుల  నిర్లక్ష్యానికి పాడుబడి, పూర్తిగా కనుమరుగైయ్యే దుస్దితికి చేరుకుంది. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనే స్వచ్చంద సంస్థ రంగంలోకి దిగి, జిహెచ్ ఎంసీ ,తెలంగాణా ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ సమిష్టి సహారంతో ఓ మహా అద్భుతానికి తుది మెరుగులు దిద్దింది. చరిత్రలో కనుమరుగైన బన్సీలాల్ పేట మెట్లబావికి తిరిగి పూర్వ వైభవం రానుంది. 

మెట్ల బావి నేపథ్యం ఇది...

ఒకప్పుడు ఈ మెట్లబావి ప్రాంతాన్ని నాగన్నకుంట అని కూడా అనేవారు. 2021లో పాడుబడిన స్దితిలో ఉన్న మెట్లబావి వద్ద పరిస్దితి చూసి, ఏం చేద్దాం ..ఈ ప్రాంతాన్నిఎలా అభివృద్ది చేద్దామని ప్రయత్నిస్తే బావిని తిరిగి పునరుద్దరిద్దాం అనే దాని కంటే కమ్యూనిటీ హాల్,గోషాల ఇలా రకరకాల సలహలు ఇచ్చినవారే తప్ప గ్రౌండ్ వాటర్ ను రీస్టోర్ చేద్దాం. మెట్లబావికి తిరిగి ఊపిరిపోద్దాం.. భావితరాలకు భూగర్భజలాల లభ్యతకు లోటు లోకుండా చేద్దాం అనేలా ఆలోచించిన వారు తక్కువ మందే అని చెప్పవచ్చు.అయితే ఈ మెట్లబావికి తిరిగి పూర్వ వైభవం తెచ్చి అరుదైన పర్యాటక ప్రాంతంగా తీర్చదిద్దుదాం అనే దిశగా ముందుకు సాగారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ,  రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ సంస్ధ నిర్వాహకులు. నలభైఏళ్లపాటు పాడుబడిన మెట్లబావి నుంచి ఏకంగా రెండువేల టన్నుల చెత్తను బయటకు తీసారు. ఈ క్రమంలో వినాయకుడు, హనుమంతుడు వంటి పురాతన విగ్రహాలు పాడుబడిన బావి నుంచి బయటపడ్డాయి. అలా ఒక్కమాటలో చెప్పాలంటే మెట్లబావికి తిరిగి కొత్తరూపు తెచ్చేందుకు ఎనిమిది నెలలపాటు ఓ మహాయజ్హమే జరిగింది.

గతంలో బావి నిర్లక్ష్యానికి గురైన తరువాత క్షణికావేశంలో చుట్టుప్రక్కలవారు ఇదే బావిలో దూకి ప్రాణాలు కోల్పోయేవారు. కొన్నాళ్లు ఓ సూసైడ్ స్పాట్ గా మారింది.ఈసారి ఆ పరిస్దితి రాకుండా బావిలోకి ఎవరూ దూకి ఆత్మహత్యలు చేసుకునే అవకాశం లేకుండా చుట్టూ ఎతైన ఫిన్షింగ్ ఏర్పాటు చేసారు.బావికి ఓవైపున వ్యూవింగ్ గ్యాలరీ ఏర్పాటు చేసారు.ఇక్కడి నుండి చూస్తే బావి చూట్టూ ఓ సుందర ఆహ్లదరక వాతావారణం ఉండేలా గ్రీనరీతో ,లైటింగ్ ,అండర్ వాటర్ లైటింగ్, నైట్ ఎఫెక్ట్స్ ,స్టీట్ లైటింగ్ ఇలా ఒకటేమిటి నగరానికి వచ్చే పర్యాటకులకు కచ్చితంగా ఓసారి చూడాలనిపించేలా అత్యంత సుందరంగా, అద్భతంగా మెట్లబావికి  పర్యాటక సొగసులు జోడించారు.ఇక్కడకు వచ్చేవారు, స్కూల్ విద్యార్దులు మెట్లబావి చరిత్రను తెలుసుకునేలా ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు.ఇలా ఒకప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన ఈ చారితాత్మక కట్టడానికి తిరిగి పూర్వవైవం తేవడమే కాదు ,భవిష్యత్ లో బావి నిర్లక్ష్యానికి గురికాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.
 
నేడు జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ధర్నాలు

కాంగ్రెస్ పార్టీ  భూమి, వ్యవసాయ, రైతు సమస్యలపై వరస పోరాటాలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే మండల, నియోజక వర్గ కేంద్రాలలో ధర్నాలు చేపట్టిన టీపీసీసీ నేడు జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేయనుంది.  వికారాబాద్ జిల్లా కేంద్రంలోజరిగే ధర్నాలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఖమ్మంలో జరిగే ధర్నాలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొంటారు. ప్రధానంగా ధరణి పోర్టల్ రద్దు చేయాలని, రుణ మాఫీ చేసి రైతులకు న్యాయం చేయాలని, పోడు రైతులకు పట్టాలను ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ధరణి సమస్యలు పరిష్కరించాలని, రైతు రుణమాఫీ చేసి, పోడు భూములు అసైన్ భూముల సమస్యలను పరిష్కరించి ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను నిర్వహిస్తున్నట్లు పిసిసి అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డి తెలిపారు.

కరీంనగర్ లో పొన్నం.
ధరణి పోర్టల్ వల్ల కలుగుతున్న సమస్యల పట్ల రైతులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దీనికి నిరసనగా అధిష్టానం పిలుపుమేరకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిర్వహించనున్న ధర్నా ఈరోజు కలెక్టరేట్ ముందు జరగనుంది దీనికి ఉమ్మడిజిల్లాకి చెందిన సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ ,జీవన్ రెడ్డి ,శ్రీధర్ బాబు తదితరులు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలపై దూకుడు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పై వరుస ధర్నాలు నిరసనలు నిర్వహిస్తోంది.

నేడు నిర్మల్ నియోజకవర్గం రత్నాపూర్ కండ్లీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం.

బీజేపీ రాష్ట్రఅధ్యక్ష్యుడు బండి సంజయ్ చేపట్టి ప్రజాసంగ్రామ యాత్ర నిర్మల్ నియోజకవర్గంలో కొనసాగుతోంది.  ఇవాళ బండి సంజయ్ ఐదో విడదత పాదయాత్ర రత్నాపూర్ కండ్లి, కన్కాపూర్, నర్సాపూర్ , వడ్డేపల్లి, బోరేగావ్, మామ్ డ   మీదుగా సాగనుంది. ఈ రోజు 14.3 కిమీ ల పాదయాత్ర కొనసాగనుంది. 

Published at : 05 Dec 2022 09:24 AM (IST) Tags: Telugu News Today Telangana LAtest News TS News Developments Today Telangana Headlines Today

సంబంధిత కథనాలు

Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం

Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

YS Sharmila Padayatra: నెక్కొండ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల

YS Sharmila Padayatra: నెక్కొండ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల

Telangana Budget 2023: అభివృద్ధిలో దేశానికే ఆదర్శం నా తెలంగాణ- బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై

Telangana Budget 2023: అభివృద్ధిలో దేశానికే ఆదర్శం నా తెలంగాణ- బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్‌

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్‌

టాప్ స్టోరీస్

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల

Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల