News
News
X

TS News Developments Today: ఈరోజు నుంచి విధులు బహిష్కరించి నిరసన తెలపనున్న అటవీశాఖ అధికారులు

మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. రెండు రోజులుగా కొనసాగిన తనిఖీలు పూర్తయ్యాయి. మంత్రి మల్లారెడ్డికి నోటీసులు జారీ చేసిన అధికారులు సోమవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు.

FOLLOW US: 
 

ఈరోజు నుంచి అటవీశాఖ అధికారుల విధులు బహిష్కరించి నిరసన

తెలంగాణలో ఈరోజు నుంచి విధులు బహిష్కరిస్తామని ఫారెస్ట్‌ సిబ్బంది అల్టిమేటం ఇచ్చారు. గుత్తికోయల దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలు శత్రువులుగా భావిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని ఫారెస్ట్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తరహాలో తమకు కూడా ప్రభుత్వం తుపాకులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. స్పష్టమైన హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని ఫారెస్ట్ సిబ్బంది స్పష్టం చేశారు. అలాగే సిబ్బందిని కూడా పెంచాలని డిమాండ్ చేశారు.

మల్లారెడ్డి వర్సెస్ ఐటి అధికారులు

రెండు రోజులపాటు హైదరాబాద్ లో మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, ఆఫీసుల్లో జరిగిన దాడుల్లో అనేక విషయాలు బయటికి వచ్చినట్లు సమాచారం. అయితే అటు అధికారులపై మల్లారెడ్డి ఆరోపణలు చేస్తుండగా, ఇటు అధికారులు మత అధికారిని మల్లారెడ్డి బంధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఐటి అధికారులు. మల్లారెడ్డి కూడా ఐటి అధికారులపై ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ లో మంత్రి మల్లా రెడ్డి ఐటీ శాఖ పరస్పర ఫిర్యాదులు. తమ అధికారిని మంత్రి బంధించారని ఫిర్యాదు చేసిన ఐటీ అధికారులు. తాము సేకరించిన డాక్యుమెంట్లు మంత్రి చించి వేశారని తమ ల్యాప్ టాప్ ను  బలవంతంగా మంత్రి తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారులు తమపై దాడి చేసి బలవంతంగా తప్పుడు లెక్కలతో తమ సంతకం తీసుకున్నారని మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ఐటీ శాఖ ఫిర్యాదును దుండిగల్ పీఎస్ కు ట్రాన్స్ఫర్ చేసిన అధికారులు. నేడు ఈ కేసులు ఎటువైపుకు వెళ్తాయి? ఇంకా ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. ఇక మల్లారెడ్డి తో పాటు ఇద్దరు కుమారులకు అల్లుడు రాజశేఖర్ రెడ్డి తో పాటు వియ్యంకుడు లక్ష్మా రెడ్డి కి ఐటీ శాఖ నోటీసులు అందించారు. 

News Reels

సోమవారం తమ ముందు హాజరు కావాలి మంత్రి మల్లారెడ్డి కి ఐటి శాఖ నోటీసులు

మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. రెండు రోజులుగా కొనసాగిన తనిఖీలు పూర్తయ్యాయి. తర్వాత మంత్రి మల్లారెడ్డికి నోటీసులు జారీ చేసిన అధికారులు సోమవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. మల్లారెడ్డి నివాసం దగ్గర రాత్రంతా హైడ్రామా చోటు చేసుకుంది. ఇటు ఐటీ అధికారులు, అటు మల్లారెడ్డి పరస్పరం పోలీసులకు కంప్లైంట్ చేశారు. అధికారులు తప్పుడు సమాచారంతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తన కుమారుడితో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. రత్నాకర్ అనే ఐటీ అధికారిపై బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అదే సమయంలో మంత్రి మల్లారెడ్డి తీరుపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు.

నేడు మండల కేంద్రాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు..

తెలంగాణలో భూసర్వేలు, వ్యవసాయ భూమి, సమస్యలపై రాష్ట్రంలోని అన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు భూమి, వ్యవసాయ సమస్యలపై.ఎమ్మార్వోలకు వినతిపత్రాలు ఇవ్వనున్న టీ.కాంగ్రెస్ నేతలు. జిల్లాలకు సీనియర్ నాయకులతో ఇంచార్జ్ లను నియమించిన టీపీసీసీ. టీపీసీసీ ఆధ్వర్యంలో వ్యవసాయ, రైతు, భూమి సంబంధ అంశాలపై మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించనున్నారు. మండల రెవిన్యూ అధికారులకు వినతి పత్రాలు అందించనున్న కాంగ్రెస్ నేతలు. ఈ విషయాలపై ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ల ఆధ్వర్యంలో టీపీసీసీ నాయకులు 21న సిఎస్ ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చిన నాయకులు. 24న మండలాల్లో, 30న నియోజక వర్గ కేంద్రాలలో, డిసెంబర్ 5న జిల్లా కేంద్రాలలో ధర్నాలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ. 


నేడు తెలంగాణ గవర్నర్ ను కలవనున్న బీజేపీ నేతలు. 

బీజేపీ ఎంపీ, పార్టీమెంటరీబోర్డు మెంబర్ డాక్టర్ కే. లక్ష్మణ్ తోపాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ మదవ్ తో పాటు నేతలు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరాజన్ ను కలవనున్నారు. 


మహబూబాబాద్ జిల్లాలో సత్యవతి రాథోడ్ టూర్
రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఉదయం 8:30 గం. లకు నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, మెడికల్ కాలేజ్ లను సందర్శించనున్నారు

పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు

పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష 10 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లాలో 63వేల 77 ఎకరాల అటవీ భూమిని గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేస్తున్నారు. ములుగు జిల్లాలో 92 వేల ఎకరాల భూమి సాగులో ఉంది. వీటికి తోడు గొత్తికోయ గిరిజన గూడాంలు 74 దాకా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 34వేల 884 దరఖాస్తులొచ్చాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పోడును అడ్డుకునే క్రమంలో అధికారులపై సాగుదారులు దాడులకు తెగబడుతున్నారు. ఏడాది కాలంలో ఇలా 16 ఘటనలు జరిగాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో పోడు జరుగుతుందని బీట్ అధికారి శ్రీనివాస్, సెక్షన్ అధికారి ప్రభాకర్‌ను పోడుదారులు కర్రలతో కొట్టారు. కుక్కలతో దాడి చేయించారు. జూన్ నెలలో తాడ్వాయి మండలం గంగారంలో అధికారులకు, గొత్తి కోయగూడెం వాసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు.

దూకుడు పెంచిన పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాజకీయంగా మరోసారి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో సైలెంట్ గా వ్యవహరించిన పొన్నం మరోసారి ఎంపీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు అంతేకాకుండా దాదాపుగా నియోజకవర్గంలోని ముఖ్య ప్రాంతాలను కవర్ చేస్తూ ఇప్పటికే పాదయాత్ర సైతం నిర్వహించారు. మాటల్లో, చేతుల్లో దూకుడు ప్రదర్శించే పొన్నం ప్రభాకర్.. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉండడంతో ఒకానొక సమయంలో రాజకీయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అలాంటిది మళ్లీ యాక్టివ్గా మారడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబర పడుతున్నాయి.

Published at : 24 Nov 2022 08:23 AM (IST) Tags: Telugu News Today Telangana LAtest News TS News Developments Today Telangana Headlines Today

సంబంధిత కథనాలు

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

KCR Vs Goverer : బెంగాల్, కేరళ సీఎంల బాటలో కేసీఆర్ - గవర్నర్‌కు ఆ హోదా కట్ చేయడం ఖాయం ! వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు

KCR Vs Goverer :  బెంగాల్, కేరళ సీఎంల బాటలో కేసీఆర్ - గవర్నర్‌కు ఆ హోదా కట్ చేయడం ఖాయం ! వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

టాప్ స్టోరీస్

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

బుధవారం నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ - కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాలివే

బుధవారం నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ - కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాలివే