News
News
X

TS News Developments Today: నేడు సిబిఐ అధికారులు ఏం చేయబొతున్నారు? కవితను విచారిస్తారా? 

ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సిబిఐ అధికారులు వెళ్తారా? లేదా? అనేది ఉత్కంఠ గా మారింది. సిబిఐ అధికారులు సోమవారమే హైదరాబాద్ చేరుకున్నారు. వారు ఏం చేస్తారనేది ఇంతవరకూ తెలియదు. 

FOLLOW US: 
Share:

నేడు సిబిఐ అధికారులు ఏం చేయబొతున్నారు? కవితను విచారిస్తారా? 

నేడు లిక్కర్ స్కాం కు సంబంధించి సిబిఐ ఎమ్మెల్సీ కవితని విచారించనుందా? అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులకు అందజేశారు. మొదట తాను ఆరున అంటే ఈరోజు అందుబాటులో ఉంటానని చెప్పారు. కానీ తర్వాత ఎఫ్ఐఆర్ పరిశీలించిన తర్వాత అందులో తన పేరు లేదనీ, తాను ఈరోజు అందుబాటులో ఉండడం లేదని సిపిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాదులో ఇంట్లో ఉంటానని, ఏదైనా ఒక రోజు కలవచ్చని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సిబిఐ అధికారులు వెళ్తారా? లేదా? అనేది ఉత్కంఠ గా మారింది. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు సిబిఐ అధికారులు సోమవారమే హైదరాబాద్ చేరుకున్నారు. వారు ఏం చేస్తారనేది ఇంతవరకూ తెలియదు. 

నేడు ఎల్పీనగర్ లో మంత్రి కేటిఆర్ పర్యటన. 

నేడు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గం పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఫతూల్లాగూడలో మూడు మతాలకు ఒకే చోట శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. దీన్ని 6.5 ఎకరాల్లో 16.25 కోట్లతో హెచ్ఎండిఏ ఈ పనులు పూర్తి చేసింది. దీన్ని ఈరోజు కేటిఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణలో ఒకే చోట మూడు మతాల శ్మశాన వాటికను నిర్మించడం ఇదే తొలిసారి. అదే విధంగా దేశ విదేశాల్లో ఉన్న బంధువులు, కుటుంబ సభ్యులు తమ వారి అంత్యక్రియలు ప్రత్యక్షంగా లైవ్లో వీక్షించేందుకు లైవ్ లింక్ ను కూడా ఏర్పాటు చేశారు. 

ఇక నాగోల్ - గౌరెల్లి రేడియల్ రోడ్లో హిందూ అరణ్యా నుంచి ఫతూల్లాగూడ కూడా మీదుగా 60 కోట్ల వ్యయంతో మూసి వరకు నిర్మించిన 100 అడుగుల లింకు రోడ్డును  మంత్రి ప్రారంభిస్తారు. SNDP కింద సుమారు 30 కోట్లతో బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు మీదుగా మూసి వరకు చేపట్టిన నాలాను మంత్రి ప్రారంభిస్తారు. ఫతూల్లాగూడలో జంతుసంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన జంతువుల దహన వాటిక ప్రారంభిస్తారు. జంతువులు చనిపోతే వాటి ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి. అదే విధంగా పెంచుకున్న జంతువులు చనిపోతే వాటిని అంత్యక్రియలు ఎక్కడ చేయాలో తెలియక యజమానులు ఆందోళన చెందుతున్నారు. అలాంటివారికి GHMC ఆధ్వర్యంలో జంతువుల కోసం శ్మశాన వాటిక నిర్మించింది. పీపుల్స్ ఫర్ యానిమల్ అనే స్వచ్ఛంద సంస్థ కోటి రూపాయల వ్యయంతో ప్రత్యేక షెడ్ నిర్మించారు. కేవలం పెంపుడు జంతువులే కాక రోడ్డు పక్కన వీధిలో మృతి చెందిన వాటి వివరాలను ఇస్తే వాటిని ఇక్కడికి అంతక్రియలకు తరలిస్తారు. దీంతో పాటు వనస్థలిపురంలో నిర్మించిన స్విమ్మింగ్ ఫూల్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

ఎయిర్‌పోర్టు మెట్రో టెండర్ల ప్రక్రియ షురూ. నేడు జనరల్‌ కన్సల్టెంట్‌ ఈవోఐపై ప్రీ అప్లికేషన్‌ సమావేశం.

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు నిర్మించబోయే ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. కాంట్రాక్టు ఏజెన్సీలను నియమించే పని మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి నేడు హైదరాబాద్‌లో (హెచ్‌ఏఎంఎల్‌) హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ ప్రీ అప్లికేషన్‌ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో డిజైన్‌ అండ్‌ బిల్డ్‌ బేసిస్‌ మీద జనరల్‌ కన్సల్టెంట్‌(జీసీ)లను ఎంపిక చేయడానికిగాను ఈ నెల 1వ తేదీన ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌(ఈవోఐ) ఆహ్వానించింది. ఈ ఈవోఐకి సంబంధించి కన్సల్టెంట్ల అనుమానాల నివృత్తికి ప్రీ అప్లికేషన్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) అధికారులు తెలిపారు. ఈ ఈవోఐ గడువు ఈ నెల 13 వరకు ఉన్నట్లు హెచ్‌ఏఎంల్‌ ఈవోఐ ఆహ్వాన ప్రకటనలో తెలిపింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్, జగ్గుస్వామికి ఊరట

తెలంగాణలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్, జగ్గుస్వామికి ఊరట కలిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. జగ్గుస్వామికి 41-ఏ సీఆర్పీఎఫ్ నోటీసులపై స్టే విధించింది. సిట్ నోటీసులపై ఈనెల 13 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అలాగే బీఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసులపై విచారణ జరిగింది. బీఎల్ సంతోష్ కు ఈనెల ఈనెల 13వ తేదీ స్టే పొడిగించింది.

నేడు హోం గార్డు దినోత్సవం.. మూడేళ్లుగా వేడుకలు లేవు.

ఏటా డిసెంబరు 6న జాతీయ హోంగార్డు దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాల్సి ఉంది. కానీ మూడేళ్లుగా జరగడం లేదు. ఇంతకుముందు వేడుకలకు కొంత ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించేది. రాత్రి వరకు వేడుకల నిర్వహించే విషయమై సర్క్యులర్‌ కోసం గార్డులు ఎదురుచూశారు. రాకపోవడంతో  తెలంగాణ వ్యాప్తంగా హోం గార్డులు కొంత నిరాశకు గురయ్యారు. 

Published at : 06 Dec 2022 08:28 AM (IST) Tags: Telugu News Today Telangana LAtest News TS News Developments Today Telangana Headlines Today

సంబంధిత కథనాలు

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !

Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !

TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు

TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు

TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ

TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ

Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!

Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!

టాప్ స్టోరీస్

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి