అసంతృప్త నేతలు గాంధీ భవన్ కు వస్తారా? లేదా అనేది ఆసక్తిగా మారింది
అసంతృప్త నేతలు గాంధీ భవన్ కు వస్తారా? లేదా అనేది తెలంగాణలో నేటి ఆసక్తి కలిగించే ప్రధాన అంశం.
TS News Developments Today: కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కొంతమంది నేతలతో ఆయన ఈరోజు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కారణాలు ఏంటి? అనేది ఆయన తెలుసుకోనున్నారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డి, బోస్ రాజు, నదీమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటి అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై డిగ్గీరాజా ఆరా తీశారు. ఎందుకు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. అసంతృప్త నేతలు గాంధీ భవన్ కు వస్తారా? లేదా అనేది ఆసక్తిగా మారింది. అలాగే రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్న నేతలు ఈరోజు గాంధీ భవన్ కొచ్చి దిగ్విజయ్ సింగ్ ముందు అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఏకరవుపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద దిగ్విజయ్ సింగ్ రాకతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు నేతలు భావిస్తున్నారు.
నేటి నుంచి హైదరాబాద్ లో బుక్ ఫెయిర్
హైదరాబాదులో పుస్తకాల పండగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు బుక్ ఫేర్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఈ బుక్ ఫేర్ కొనసాగుతుంది. ప్రతి శనివారం, ఆదివారాల్లో, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ బుక్ ఫేయిర్ కొనసాగుతుంది. విద్యార్థులకు ప్రవేశం కూడా ఉచితంగా ఉంటుంది. 340 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణంగా నిలవనున్న సీఎం స్పెషల్ స్టాల్. ఈ 35వ బుక్ ఫెయిర్లో సీఎం కేసీఆర్ పేరు మీద ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సీఎం రాసిన వివిధ పుస్తకాలు, సీఎంకు సంబంధించి వివిధ రచయితలు రాసిన పుస్తకాలను ఈ ప్రత్యేక స్టాల్ లో ఉంచనున్నారు. ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు, అభ్యర్థులకు కావలసిన పుస్తకాలాన్ని పొందుపరిచామని ఆర్గనైజర్ తెలిపారు. అదేవిధంగా సాయంత్రం పూట సాంస్కృతి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
నేడు ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పర్యటన.
నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగే కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు.
నేడు పాలమూరుకు మంత్రి హరీశ్‌రావు
పాత కలెక్టరేట్ స్థలంలో సూపర్‌స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు నేడు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రానున్నా రు. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2:30కు మంత్రి హరీశ్‌రావు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. ముందుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ దవాఖానను పరిశీలించనున్నారు. అనంతరం సూపర్‌స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. నూతన కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్
మంత్రి హరీశ్‌రావు పర్యటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్, డీఎంహెచ్‌వో శశికాంత్, అధికారులు పాల్గొన్నారు.
బీఎఫ్.7పై నేడు హరీశ్‌రావు సమీక్ష
కరోనా బీఎఫ్.7 వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం కూడా ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో.. కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ముఖ్యంగా.. హైదరాబాద్‌కు అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని, ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. విమానాశ్రయంలోనూ వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు పదిలోపు ఉంటున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లో మినహా.. మిగతా చోట్ల జీరో కొవిడ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సగటున ఐదు వేల పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీఎఫ్.7 నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రమంతటా పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. మన దగ్గర ఇప్పుడు కొవిడ్/బీఎఫ్.7 ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ దాదాపుగా పూర్తయిందని.. సింహభాగం ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉందని అధికారులు చెబుతున్నారు.
అమ్రాబాద్ అడవుల్లోకి చిరుత
ఇటీవల హైదరాబాద్ నగర్ శివారులోని హెట్రో ల్యాబ్స్లోకి దూరిన నాలుగేళ్ల మగ చిరుతను ఇవాళ అమ్రాబాద్ (టైగర్ ఫారెస్ట్) అడవిలోకి వదిలి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. దీని కోసం అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17న హెట్రో డ్రగ్స్ లో ల్యాబ్స్ లోకి దూరిన చిరుత ను జూ అధికారులు పట్టుకొని జూకు తరలించారు. దానికి ఆరోగ్యపరీక్షలన్నీ చేశారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉండటంతో అటవీ శాఖ అధికారులు దానిని అడవిలోకి వదలాలని నిర్ణయించారు. గురువారం అచ్చంపేట సమీపంలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నారు.