అన్వేషించండి

TS News Developments Today: నేటి తెలంగాణ ముచ్చట్లు ఇవే!

ఈ మధ్యాహ్ననం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది.

ఇవాళ కేబినెట్ భేటీ 

ఈ మధ్యాహ్ననం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. రైతులు పండించిన ధాన్యం కొనుగోల్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగా ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణంపై ప్రభుత్వం అందించే సాయం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై తెలంగాణ మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.


నేడు, రేపు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైద‌రాబాద్ లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో మరోసారి కార్‌ రేసింగ్‌ జరుగనుంది. నేడు, రేపు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ చివరి సిరీస్‌ నిర్వహించనున్నారు. నెక్లెస్ రోట‌రీ నుంచి తెలుగు త‌ల్లి జంక్షన్, సెక్రటేరియ‌ట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కంపౌండ్, ఐమ్యాక్స్ వ‌ర‌కు లీగ్‌ కొన‌సాగ‌నుంది. ఎన్టీఆర్‌ మార్గ్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ నెల 11 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. దీంతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ థియేట‌ర్ల వైపు వ‌చ్చే వాహ‌న‌దారులు ప్రత్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు.

నోఎంట్రీ మార్గాలు ఇవే

వీవీ విగ్రహం (ఖైరతాబాద్‌) వైపు నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు ట్రాఫిక్‌ అనుమతి లేదు. వీవీ విగ్రహం వద్ద షాద‌న్ కాలేజ్‌, రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు.

బుద్ధభవన్ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్‌ నుంచి రాణిగంజ్‌, ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు.

 రసూల్‌పురా, మినిస్టర్‌ రోడ్డు నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్‌ వద్ద రాణిగంజ్‌ వైపు మళ్లిస్తారు.

ఇక్బాల్‌ మినార్‌ నుంచి తెలుగు తల్లిజంక్షన్‌, ట్యాంక్‌ బండ్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ఫ్లైఓవ‌ర్‌ పైనుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మ‌ళ్లిస్తారు.

 ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌, రవీంద్ర భారతి జంక్షన్‌ వైపు మ‌ళ్లించ‌నున్నారు.

బీఆర్‌కే భవన్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్‌ నుంచి ఇక్బాల్‌మినార్‌, రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.

ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ నుంచి మింట్ కంపౌండ్‌ వైపు వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను రవీంద్ర భారతి జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వైపు నుంచి ప్రింటింగ్‌ ప్రెస్‌, నెక్లెస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణేష్‌ వద్ద రాజ్‌దూత్‌ లైన్‌లోకి మళ్లిస్తారు.

ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మాప్‌ అప్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి అయింది. మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్‌ అప్‌ రౌండ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. విద్యార్థులు నేటి నుంచి 12వ తేదీ వరకు వెబ్‌ ఆఫ్షన్లును నమోదు చేసుకోవాలి. ఇతర సమాచార వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని నోటిఫికేషన్‌లో కోరారు. అలాగే, ఆలిండియా కోటా బీహెచ్‌ఎంఎస్ సీట్ల భర్తీకి వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

1392 జూనియర్‌ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్‌ 

ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారిగా జూనియర్‌ లెక్చరర్ల భర్తీకి తెలంగాణ సర్కార్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వరుస నోటిఫికేషన్లతో నియామక ప్రక్రియను పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం శుక్రవారంనాడు 1392 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 16నుంచి దరఖాస్తుల ప్రక్రియకు నిర్ణయించింది. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో 1100 జూనియర్‌ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్‌ తర్వాత మరోసారి ఇంత పెద్ద మొత్తంలో జేఎల్‌ భర్తీ ఇదే కావడం గమనార్హం. ఈ నెల 16నుంచి జనవరి 6వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు.

 సబ్జెక్టుల వారీగా…

అరబిక్‌ 2, బోటనీ 113, బోటనీ ఉర్దుమీడియం 15, కెమిస్ట్రీ ఉర్దూ మీడియం 19, సివిక్స్‌ మరాఠీ మీడియం 1, కామర్స్‌ 50, కామర్స్‌ ఉర్దూ మీడియం 7, ఎకనామిక్స్‌ 81, ఎకనామిక్స్‌ ఉర్దూ మీడియం 7, ఇంగ్లీష్‌ 153, ఫ్రెంచ్‌ 2, హిందీ 117, హిస్టరీ 77, హిస్టరీ ఉర్దూ 17, హిస్టరీ మరాఠీ 1, మ్యాథమెటిక్స్‌ 154, మ్యాథమెటిక్స్‌ ఉర్దూ 9, ఫిజిక్స్‌ 112, ఫిజిక్స్‌ ఉర్దూ మీడియం 18, సంస్కృతం 10, తెలుగు 60, ఉర్దూ 28, జియాలజీ 128, జియాలజీ ఉర్దూ 18 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ వెల్లడించింది.


సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ 4233 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 585 సర్వీసులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులను టీఎస్‌ ఆర్టీసీ నడపనుంది. ఈ మేరకు సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ఇతర అంశాలపై టీఎస్‌ ఆర్టీసీ ఎండి విసి సజ్జన్నార్‌  బస్‌భవన్‌లో ఉన్నతాధికారులు, ఆర్‌ఎంలు, డీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ఏడాది 3736 బస్సులను నడపగా, ఈ సారి అంతకన్నా 10 శాతం అదనపు బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఏపీలోని అమలాపురం 125, కాకినాడ 117, కందుకూరు 83, విశాఖపట్నం 66, పోలవరం 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. కాగా, సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్డ్స్‌ టికెట్‌ బుకింగ్‌ సౌకర్యాన్ని వినియోగించే వ్యవధిని 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ వరకు అడ్వాన్స్డ్‌ బుకింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుందనీ, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సజ్జన్నార్‌ వెల్లడించారు.

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget