SCR ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి-మన్నార్గుడి రైళ్లలో అదనపు చైర్ కార్ కోచ్‌లు.. తేదీ కూడా వచ్చేసింది!
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు ఓ శుభవార్తను ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లలో అదనపు చైర్ కార్ కోచ్ లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు ఓ శుభవార్తను ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లలో అదనపు చైర్ కార్ కోచ్ లను పెంచుతున్నట్లు ప్రకటించింది. తద్వారా ప్రయాణికులకు మరింత మెరుగుగా ప్రయాణం చేసేందుకు అవకాశం కలుగుతుంది. అయితే ఈ చైర్ కార్ కోచ్ ల పెంపు శాశ్వతంగా అమలు చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. 17407 నంబర్ గల రైలు (తిరుపతి ఎక్స్‌ప్రెస్) రైలు లో రెండు చైర్ కార్ కోచ్ లను అదనంగా చేర్చనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు తిరుపతి నుంచి మన్నార్గుడికి వెళుతుంది. అదే రీతిలో 17408 నంబర్ గల రైలు (మన్నార్గుడి ఎక్స్‌ప్రెస్) లో కూడా రెండు చైర్ కార్ కోచ్ లను అదనంగా జోడించాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ రైలు మన్నార్గుడి నుంచి తిరుపతికి వెళుతుంది. ఈ చైర్ కార్ కోచ్ ల సౌకర్యం రైలు ప్రయాణికులు సెప్టెంబర్ 4, 2025 నుంచి అమల్లోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి ఎ. శ్రీధర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.





















