అన్వేషించండి

Nizam College Strudents Row : నిజాం కాలేజీ స్టూడెంట్స్ ఆందోళనకు హ్యాపీ ఎండింగ్ - హాస్టల్ మొత్తం వారికే !

నిజాం కాలేజీ విద్యార్థినుల సమస్యకు పరిష్కారం లభించింది. హాస్టల్ భవనం మొత్తం యూజీ విద్యార్థినులకే కేటాయిస్తూ సర్క్యూలర్ జారీ చేశారు.

Nizam College Strudents Row :  హాస్టల్ వసతి కోసం నిజాం కాలేజీ విద్యార్థినుల పోరాటం ఫలించింది. వారికి  హాస్టల్ వసతి కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కొత్తగా నిర్మించిన హాస్టల్‌ను పూర్తిగా అండర్ గ్రాడ్యూయేట్ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు నిజాం ప్రిన్సిపాల్  సర్క్యూలర్‌ విడుదలచేశారు. హాస్టల్ వసతి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ అవకాశం కల్పిస్తామని ఏమైనా మిగిలితే పీజీ వారికి ఇస్తామన్నారు.  హాస్టల్ ఫెసిలిటీ కోసం యూజీ సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. 

కొత్త  హాస్టల్ భవనంలో మొత్తం పీజీ విద్యార్థులకే అకామిడేషన్ ఇవ్వాలని మొదట నిర్ణయం 

నిజాం కాలేజీలో ఇటీవల కొత్త హాస్టల్ భవనాన్ని నిరమించారు దీన్ని మొత్తం పీజీ విద్యార్థులకే ఇవ్వాలని మొదట నిర్మయించారు. అయితే యూజీ విద్యార్థులు ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీంతో  సమస్యను పరిష్కరించాలని వెంటనే మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డి అధికారులకు దిశానిర్దేశం. అయితే అధికారుల ప్రతిపాదనలు విద్యార్థినులకు నచ్చలేదు. దాంతో వారు ఆందోళన కొనసాగించారు.  హాస్టల్ మొత్తం యూజీ విద్యార్థులకు కేటాయించాల్సిందేనన్న ఒక్క డిమాండ్‌కే వారు కట్టుబడ్డారు. అధికారులు ఎంత ఒత్తిడి చేసినా..  ఆందోళన చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. 

యూజీ విద్యార్థుల ఆందోళన - కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో సమస్యకు పరిష్కారం

కేటీఆర్ చెప్పినా సమస్య పరిష్కారం కాలేదని విమర్శలు చేయడంతో  విద్యార్థినులతో  మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా మాట్లాడారు.  హాస్టల్ వసతి విషయంలో ఓయూ వీసీ, నిజాం ప్రిన్సిపాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   చివరికి హాస్టల్ మొత్తం యూజీ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించడంతో సమస్య పరిష్కారం అయినట్లయింది. హాస్టల్ వసతి కోసం దాదాపు 15 రోజులుగా వారు కాలేజీ ఆవరణలో బైఠాయించి నిరసనలు తెలిపారు.  

హాస్టల్ నిర్మాణానికి ప్రత్యేకంగా రూ. ఐదు కోట్లు కేటాయించిన కేటీఆర్ 

నిజాం కాలేజీలో కొత్త హాస్టల్ నిర్మాణానికి కేటీఆరే నిధులు మంజూరు చేశారు. ఈ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన కేటీఆర్   ప్రభుత్వం తరఫున కాలేజ్ అభివృద్ధికి రూ.5 కోట్ల ఫండ్  కేటాయించారు. ఈ నిధులతో పాటు ఓయూ వీసీ మరో కోటి రూపాయిల ఫండ్  కాలేజీకి అలాట్ చేశారు. ఈ నిధులతో అధికారులు కాలేజీ విద్యార్థినుల హాస్టల్ భవనం నిర్మించారు. అయితే ఈ హాస్టల్ ను కేవలం పీజీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో యూజీ విద్యార్థుల గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. చివరికి ఆ సమస్య అలా పరిష్కారం అయింది. హాస్టల్ కోసం పోరాడిన విద్యార్థినులు సమస్య పరిష్కారంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మార్గదర్శి సహా చిట్ ఫండ్ సంస్థల్లో సోదాలు - అక్రమంగా డిపాజిట్లు తీసుకుంటున్నారన్న ఏపీ అధికారులు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Adulterated Ghee Case: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
Andhra Pradesh Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌ను వదలని వానలు- 11 జిల్లాలకు రెడ్ అలర్ట్‌- తుపాను నష్ట అంచనాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ను వదలని వానలు- 11 జిల్లాలకు రెడ్ అలర్ట్‌- తుపాను నష్ట అంచనాలు ప్రారంభం
Telangana High Court: బ్రీత్‌ అనలైజర్ డేటాతో అలా చేస్తామంటే కుదరదు! తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు 
బ్రీత్‌ అనలైజర్ డేటాతో అలా చేస్తామంటే కుదరదు! తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు 
US Federal Reserve: అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
Advertisement

వీడియోలు

Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
Hurricane Melissa batters Jamaica | జ‌మైకాను నాశనం చేసిన మెలిసా హరికేన్ | ABP Desam
US Airforce Records Inside Hurricane Melissa | హరికేన్ మెలిస్సా ఎంత ఉద్ధృతంగా ఉందో చూడండి | ABP Desam
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Adulterated Ghee Case: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
Andhra Pradesh Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌ను వదలని వానలు- 11 జిల్లాలకు రెడ్ అలర్ట్‌- తుపాను నష్ట అంచనాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ను వదలని వానలు- 11 జిల్లాలకు రెడ్ అలర్ట్‌- తుపాను నష్ట అంచనాలు ప్రారంభం
Telangana High Court: బ్రీత్‌ అనలైజర్ డేటాతో అలా చేస్తామంటే కుదరదు! తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు 
బ్రీత్‌ అనలైజర్ డేటాతో అలా చేస్తామంటే కుదరదు! తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు 
US Federal Reserve: అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
EPF Money ATM Withdrawal Process : ATM నుంచి EPF డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకోండి!
ATM నుంచి EPF డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకోండి!
Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
Sreeleela : హిందీ 'జేజెమ్మ'గా యంగ్ బ్యూటీ? - టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ సమర్పణలో...
హిందీ 'జేజెమ్మ'గా యంగ్ బ్యూటీ? - టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ సమర్పణలో...
Australian cricketer Ben Austin:ప్రాక్టీస్‌లో బంతి తగిలి క్రికెటర్‌ మృతి-క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం
ప్రాక్టీస్‌లో బంతి తగిలి క్రికెటర్‌ మృతి-క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం
Embed widget