By: ABP Desam | Updated at : 30 Nov 2022 03:24 PM (IST)
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టులో విచారణ
MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు లో నిందితుల బెయిల్ పిటిషన్ ఫై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. రామచంద్ర భారతి, నంద కుమార్, సింహ యాజీ లు తమకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. అయితే నిందితులకు బెయిల్ ఇవ్వవొచ్చని.. పలు సుప్రీం తీర్పు లను నిందితుల తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గురువారం మరోసారి ప్రభుత్వ వాదనలు వింటామన్న హైకోర్టు.. విచారణను వాయిదా వేసింది.
మరో వైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ.. తుషార్ చెల్లపల్లి దాఖలు చేసుకున్న పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ జరిగింది. కేరళకు చెందిన తుషార్ ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రెండు రోజుల క్రితం తుషార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారుఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు తుషార్ ను అరెస్ట్ చేయవద్దని సిట్ ను ఆదేశించింది. అంతేకాదు విచారణకు సహకరించాలని తుషార్ ను ఆదేశించింది. మరోవైపు విచారణకు తుషార్ సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాలుంటే తమను ఆశ్రయించాలని హైకోర్టు తుషార్ కి సూచించింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తుషార్, బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు జారీ చేసినా హాజరు కావడం లేదు. తనకు ఆరోగ్యం బాగా లేనందున రెండు వారాల సమయం కోరినట్టుగా తుషార్ పేర్కొన్నారు. కానీ ఈ విషయమై తాను సిట్ కు మెయిల్ పంపానన్నారు.ఈ మెయిల్ కు స్పందించకుండానే లుకౌట్ నోటీసులు జారీ చేశారని తుషార్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.బీజేపీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ మహేష్ జఠ్మలానీ వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని న్యాయవాది మహేష్ తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే సిట్ విచారణ జరుగుతోందని మహేష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు రూల్స్ ఫాలో కాలేదని న్యాయవాది మహేష్ పేర్కొన్నారు.
ఈ నెల 23న బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కి సిట్ నోటీసులు పంపింది. అంతకు ముందు కూడా విచారణకు రావాలని కూడా నోటీసులు పంపారు. కానీ సంతోష్ విచారణకు రాలేదు.ఈ నోటీసులపై బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 25న బీఎల్ సంతోష్ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే కొనసాగుతుంది. మరో వైపు విచారణకు రావాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూడా నోటీసులు జారీ చేశారు. కానీ.. ఆయన హాజరు కాలేదు. విచారణకు రానవసరం లేదని అవసరమైనప్పుడు తామే పిలుస్తామని రఘురామకృష్ణరాజుకు సిట్ అధికారులే సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది.
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
BJYM Protest : డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, బీజేవైఎం అధ్యక్షుడికి గాయాలు
Mulugu District: ములుగులో ముక్కోణం- వచ్చే ఎన్నికల కోసం ప్రధాన పార్టీల వ్యూహరచన
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?
MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం