By: ABP Desam | Updated at : 06 Apr 2023 01:23 PM (IST)
హైకోర్టులో బండి సంజయ్‌కు దక్కని ఊరట
Bandi Sanjay : బండి సంజయ్ రిమాండ్ ను రద్దు చేయాలని బీజేపీ గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో దాఖలుచేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. పిటిషన్‌పై విచారణ సమయంలో బండి సంజయ్ తరపున వాదించిన రామచంద్రరావు బండి సంజయ్‌పై తప్పుడు కేసు పెట్టారన్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అసుల బండి సంజయ్‌పై ఉన్న అభియోగాలేమిటని న్యాయమూర్తి అడిగారు. పేపర్ లీకేజీ అనిచెప్పడంతో క్వశ్చన్ పేపర్ పబ్లిక్ డిమాండ్‌లోకి వచ్చాక లీకేజీ ఎలా అవుతుందని న్యామయూర్తి ప్రశ్నించారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే వరుసగా మూడు రోజులుగా సెలవులు ఉన్నాయని బండి సంజయ్ తరపు న్యాయమూర్తి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు.
టెన్త్ పేపర్ల లీకేజీకి కుట్ర పన్నారని పోలీసులు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. హన్మకొండ కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ రిపోర్టులో పేపర్ లీకేజీ కుట్ర పన్నారని అభియోగాలు నమోదు చేశారు. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని.. ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారని అందులో కుట్ర ఉందని ఎలా అంటారని.. ఆయనతరపు న్యాయవాదులు కోర్టులో వాదించినా ప్రయోజనం లేకపోయింది. బండి సంజయ్ కు జడ్జి 14 రోజులు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు.
అసలు టెన్త్ పేపర్ల లీక్ కుట్ర బండి సంజయ్ దేనని వరంగల్ సీపీ ఆరోపించారు. టెన్త్ పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు.
బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు సీపీ. బండి సంజయ్, ప్రశాంత్ మధ్య పలు కాల్స్, చాట్స్ జరిగినట్లుగా సీపీ తెలిపారు. బండి సంజయ్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందన్నారు. బండి సంజయ్ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
నిందితుడు బూర ప్రశాంత్ గతంలో జర్నలిస్టుగా పనిచేశాడని, ప్రస్తుతం అతనికి ఏ మీడియా సంస్థతో సంబంధం లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు. వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు హైకోర్టు చాన్స్ ఇచ్చింది.
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్
Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్
TSPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?