అన్వేషించండి

Phone Tapping Issue : ఢిల్లీలో ఈసీ - హైదరాబాద్‌లో హైకోర్టు ! ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు బీజేపీ ప్రయత్నాలు

ఫోన్ ట్యాపింగ్‌ చేస్తున్నారని విచారణ చేయించాలని బీజేపీ నేతలు ఈసీ, హైకోర్టులను ఆశ్రయించారు. హైకోర్టు నాలుగో తేదీన విచారణ చేపట్టనుంది.

 

Phone Tapping Issue :    తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో వేడిని బీజేపీ అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్గొంటున్న తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని  బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌చుగ్‌ ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్‌ సహా నగదు లావాదేవీల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారని..  ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు లావాదేవీలపై విష ప్రచారం చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు.   బీజేపీపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ స్వయంగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మునుగోడు ఓటర్లకు డబ్బు పంపుతోందని చుగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఈసీకి తరుణ్ చుగ్ ఫిర్యాదు

టీఆర్‌ఎస్‌ కోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని చుగ్ ఎన్నికల సంఘాన్ని కోరారు.మరో వైపు  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోషల్ యాక్టివిస్ట్ తంగెళ్ల శివప్రసాద్ రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలతో పాటు సామాన్యుల ఫోన్లను కూడా తెలంగాణ ప్రభుత్వం టాప్ చేస్తోందని వివరించారు. 

హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తంగెళ్ల శివప్రసాద్

రాష్ట్ర హోం శాఖ సెక్రటరీ, డీజీపీ, సైబరాబాద్ సీపీని బాధ్యులుగా చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.  ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5 (2) నిబంధనలను ఉల్లంఘించి.. ప్రజల వ్యక్తిగత వివరాలను ట్యాపింగ్ చేస్తున్నారని శివప్రసాద్ ఆరోపించారు. ఫోన్ ట్యాప్ చేయడం‭తోనే ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ బీజేపీ వేసిన పిటిషన్‭తో కలిపి.. నవంబర్ 4న విచారణ జరుపుతామని  తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మరో వైపు  తంగేళ్ల శివ ప్రసాద్‌రెడ్డి  సోమవారం ఢిల్లీలో  ఎమ్మెల్యేలు, సామాన్యుల ఫోన్‌లను తెలంగాణ సర్కార్‌ ట్యాప్ చేస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదును ఎన్నికల కమిషన్ స్వీకరించింది. 

బ్యాంక్ అకౌంట్లను కూడా రహస్యంగా చూస్తున్నారని బీజేపీ ఆరోపణ 

భారతీయ జనతా పార్టీ నేతలు ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్‌ చేస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తోందని.. బ్యాంక్ అకౌంట్ల వివరాలను కూడా సేకరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. గతంలో దుబ్బాక ఉపఎన్నికల సమయంలోనూ .. తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని.. ఆయన హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అయితే ఈ లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ట్యాపింగ్‌పై విచారణ జరగలేదు. ఇప్పుడు తంగెళ్ల శివప్రసాద్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం,హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget